Pushpa2: ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న బన్నీ!

బన్నీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ సాధించింది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. తొలి భాగాన్ని మించి ఆసక్తికర ట్విస్టులతో పుష్ప ది రూల్ ఉండనుందని పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని బోగట్టా.

తాజాగా బన్నీ, సుకుమార్ పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గతేడాది పుష్ప ది రైజ్ విడుదలైన రోజునే ఈ ఏడాది పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం పుష్పరాజ్ పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని అలానే కొనసాగిస్తున్నారు. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ నెలలోనే పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

పుష్ప2 పూర్తైన తర్వాతే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బన్నీ భావిస్తున్నారు. బన్నీ తర్వాత సినిమా డైరెక్టర్ల జాబితాలో చాలామంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. అయితే బన్నీ తర్వాత సినిమా విషయంలో ఏ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాల్సి ఉంది. బన్నీకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కడంతో ఇతర భాషల డైరెక్టర్లు సైతం బన్నీతో సినిమాలను తెరకెక్కించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పుష్ప ది రైజ్ సక్సెస్ బన్నీ కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అయింది.

బన్నీకి పలువురు నిర్మాతలు 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప ది రైజ్ రిలీజ్ డేట్ సెంటిమెంట్ ను బన్నీ పుష్ప ది రూల్ విషయంలో ఫాలో అవుతున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus