బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాకు సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరుగుతోంది. జాతర సీన్ ను షూట్ చేస్తుండగా ఈ సీన్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉండనుందని తెలుస్తోంది. పుష్ప2 ఓవర్సీస్ హక్కులు 97 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పుష్ప2 మూవీ అన్ని భాషల ఓవర్సీస్ రైట్స్ అమ్ముడైనట్లు సమాచారం. బన్నీ సినిమా హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడయ్యాయని తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయి.
పుష్ప2 రైట్స్ కోసం ఇంత డిమాండా అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఇలా రికార్డులు క్రియేట్ చేయడం బన్నీకే సాధ్యమంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదీ బన్నీ రేంజ్ అంటూ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప2 మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులు సైతం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.
పుష్ప2 మూవీలో రష్మిక రోల్ కూడా మరింత స్పెషల్ గా ఉండనుందని తెలుస్తోంది. పుష్ప2 మూవీ స్పెషల్ సాంగ్ లో ఎవరు కనిపిస్తారో చూడాల్సి ఉంది. బన్నీ మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానాలు దొరకాల్సి ఉంది. బన్నీ మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాగా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.
పుష్ప ది రైజ్ (Pushpa2) సినిమాతో బాలీవుడ్ మార్కెట్ ను పెంచుకున్న బన్నీ పుష్ప2 సినిమాతో అంతకుమించిన సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి. 2024 మే నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి మూవీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. బన్నీ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.