ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule). ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) హీరోయిన్ కాగా శ్రీలీల (Sreeleela) ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘పుష్ప'(ది రైజ్) (Pushpa) హిట్ అవ్వడంతో డిసెంబర్ 5న వచ్చిన ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది.
Pushpa 2 The Rule Collections
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయనే కామెంట్స్ వచ్చాయి. దీంతో మొదటి రోజు ‘పుష్ప 2’ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఒకసారి (Pushpa 2 The Rule) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకుని రూ.131.68 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.473.32 కోట్ల షేర్ రావాలి. నార్త్ లో, ఓవర్సీస్లో ఈ సినిమా కుమ్మేస్తుంది. రెండో రోజు కూడా అక్కడ భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.