ఒక హీరోయిన్ గా రాణించడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు అందుకొనేలోపు ముదిరిపోవడంతో లక్ష్మీరాయ్ కి సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ సాంగ్స్ లో చిట్టిపొట్టి బట్టలతో, తడిసిన అందాలతో డ్యాన్సులు చేసే అవకాశాలొచ్చాయే కానీ హీరోయిన్ ఛాన్స్ లు మాత్రం మంచివి రాలేదనే చెప్పాలి. అలాంటి తరుణంలో ఏకంగా బాలీవుడ్ నుంచి అమ్మడికి కథానాయికగా అది కూడా టైటిల్ రోల్ ప్లే చేసే ఆఫర్ రావడంతో ఎన్నడూ లేని విధంగా తన అందచందాలను వెండితెరపై ఆరబోసింది. ఆ సినిమా పేరు “జూలీ 2”, నిన్న విడుదలైన ఈ హిందీ చిత్రం అదే టైటిల్ తో తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదలైంది.
రాకరాక వచ్చిన అవకాశం కావడంతో అమ్మడు ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ సిగ్గు అనే విషయాన్ని మర్చిపోయి ముసలి, ముతకలతోనూ లిప్ లాక్స్ ఇచ్చి, అసలు ఒక ఆడపిల్ల నటించడానికి కూడా సిగ్గుపడే స్థాయి సన్నివేశాల్లోనూ చాలా బోల్డ్ గా నటించింది రాయ్ లక్ష్మీ. అయితే.. రిజల్ట్ మాత్రం దారుణంగా బెడిసికొట్టింది. హీరోయిన్ అందచందాలను ఆడియన్స్ కు చూపడం మీద పెట్టిన కాన్సన్ ట్రేట్ చేసిన డైరెక్టర్ కథ-కథనాలను కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదు. దాంతో సినిమా డిజాస్టర్ అయ్యింది. పాపం రాయ్ లక్ష్మీ ఆరబోసిన అందాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యింది.