Aamir Khan: అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరో!
- June 30, 2025 / 01:43 PM ISTByFilmy Focus Desk
బాలీవుడ్‌లో.. అండర్ వరల్డ్.. ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి వార్తలు తక్కువగా వస్తున్నాయి కానీ.. ఒకప్పుడు రెండూ కవల పిల్లల్లా ఉండేవి అని అంటారు. అప్పటి హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా అండర్ వరల్ట్‌తో కలసి ఉండేవారని చెబుతారు. అది ఆసక్తిగా ఉండి చేసేదా? లేక తప్పక చేసేదా అనేది తెలియదు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. గతంలో అండర్ వరల్ట్ కాంటాక్ట్‌ల గురించి తరచూ వార్తల్లో నిలిచిన వ్యక్తి ఇప్పుడు అండర్ వరల్ట్ గురించి మాట్లాడాడు. ఆయనే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్.
Aamir Khan
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమా విజయం అందుకున్న తర్వాత అండర్ వరల్డ్ నుండి ఆమిర్ ఖాన్‌కు (Aamir Khan) ఆహ్వానం అందిందట. ఆ సయమంలో పరోక్షంగా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడట. దుబాయ్ వేదికగా నిర్వహించనున్న ఓ పార్టీలో పాల్గొనమని అండర్ వరల్డ్ సభ్యులు ఆమిర్‌ను కోరారట. తన ఇంటికి వచ్చి తనను రమ్మని అడిగారు అని చెప్పాడు ఆమిర్. వాళ్లు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదని కూడా చెప్పాడు ఆమిర్. అయితే ఆపార్టీకి నన్ను తీసుకువెళ్లడానికి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారని మాత్రం చెప్పాడు.

పార్టీకి రావడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామన్నారట. ఏం కావాలన్నా చేసి పెడతామన్నారట. ఆ కార్యక్రమంలో ఆమిర్ (Aamir Khan) పాల్గొంటాడని అప్పటికే ఆ వ్యక్తులు ప్రకటించేశారట. కాబట్టి పరువుకు సంబంధించిన విషయంగా తీసుకొని అలా చేశారట. కావాలంటే కాళ్లు, చేతులు కట్టేసి బలవంతంగా తీసుకువెళ్లండి కానీ నాకు అక్కడికి రావడం ఇష్టం లేదని చెప్పాడట ఆమిర్. ఆ తర్వాత వాళ్లెప్పుడు సంప్రదించలేదట. అంతేకాదు అతని జోలికి కూడా రాలేదట.

అయితే ఆ సమయంలో చాలా భయపడ్డానని ఆమిర్ చెప్పాడు. వాళ్లతో మనకెందుకు.. వాళ్లు పవర్‌ఫుల్ అని తన తల్లిదండ్రులు కంగారుపడ్డారని ఆమిర్ చెప్పాడు. అయితే ఆ సమయంలో తాను భార్యాపిల్లల గురించే ఎక్కువ ఆలోచించా అని ఆమిర్ ఖాన్ చెప్పాడు.













