బొద్దుగుమ్మ రాశీఖన్నా నటించిన తాజా చిత్రం “జై లవకుశ” వచ్చేవారం విడుదల కానుంది. అవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా సైన్ చేసి.. భవిష్యత్ ప్రొజెక్ట్స్ కోసం సన్నబడుతూ కష్టపడుతోంది. ఇప్పటివరకూ హీరోయిన్ గా మాత్రమే చేస్తూ వచ్చిన రాశీఖన్నా మొట్టమొదటిసారిగా ఐటెం సాంగ్ లో మెరవనుంది. “బెంగాల్ టైగర్”లో తనకు జోడీగా నటించిన రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న “రాజా ది గ్రేట్” చిత్రంలో రాశీఖన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
“రాజా ది గ్రేట్” దర్శకుడు అనిల్ రావిపూడి మునుపటి చిత్రం “సుప్రీమ్”లో కథానాయిక రాశీఖన్నా కావడం, రాశీ ఆల్రెడీ రవితేజతో కలిసి నటించి ఉండడం.. అన్నిట్నీ మించి నిర్మాత దిల్ రాజు కావడంతో మరో ఆలోచన లేకుండా రాశీ కూడా స్పెషల్ సాంగ్ లో నటించేందుకు అంగీకరించింది. అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న “రాజా ది గ్రేట్”లో రవితేజ అంధుడిగా నటిస్తుండగా మెహరీన్ ఈ చిత్రంలో కథానాయిక. సో, ఇకపై రాశీని కూడా స్పెషల్ ఐటెం సాంగ్స్ లో చూడొచ్చన్నమాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
