కరోనా అన్ని ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ చూపించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో షూటింగ్ లకు బ్రేక్ పడడంతో చాలా మంది నటీనటులు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. కొందరైతే సూసైడ్ కు సైతం పాల్పడ్డారు. మరికొందరు తిరిగి షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురుచూశారు. నటుడు జావేద్ హైదర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. ప్రస్తుతం అతడు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు. కన్నకూతుర్ని చదివించలేని దయనీయ స్థితిలో ఉన్నాడు ఈ ‘దబాంగ్ 3’ యాక్టర్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జావేద్ తను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. ఎనిమిదో తరగతి చదివే తన కూతురికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నట్లు చెప్పాడు. తన కూతురికి ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయని.. దీనికోసం నెలకు రూ.2500 కట్టాల్సి ఉందని కానీ మూడు నెలలుగా ఫీజు చెల్లించలేకపోవడంతో ఆమెని ఆన్ లైన్ క్లాసుల నుండి తొలగించారని వాపోయాడు. అప్పుడు ఆమె స్కూల్ కి వెళ్లి మేనేజ్మెంట్ తో మాట్లాడినప్పటికీ వారు సానుకూలంగా స్పందించలేదని..
ఎలాగోలా డబ్బులు తీసుకొచ్చి ఫీజు చెల్లించిన తరువాతే తన కూతురిని క్లాసులకు అనుమతించారని తెలిపాడు. ఇండస్ట్రీకి చెందిన నటులను డబ్బు కోసం ప్రాధేయపడడం తనలాంటి వాళ్లకు చిన్నతనంగా అనిపిస్తుందని జావేద్ చెప్పుకొచ్చాడు. 1973లో వచ్చిన యాడోన్ కీ బారత్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన జావేద్ పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!