Radha Krishna: ప్రభాస్ డైరెక్టర్ కు హీరో దొరికేసాడోచ్.. ఎవరంటే?

కోలీవుడ్ డైరెక్టర్లు చాలా మంది టాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేశారు. అయితే వాళ్లలో ఎక్కువ శాతం మనవాళ్లకు ప్లాపులు ఇచ్చినవాళ్ళే. కానీ మన దర్శకులు అలా కాదు. వరుసగా తమిళ హీరోలకు హిట్లు, సూపర్ హిట్లు ఇస్తున్నారు. వంశీ పైడిపల్లి.. విజయ్ తో ‘వారిసు’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అటు తర్వాత వెంకీ అట్లూరి వెళ్లి ధనుష్ తో ‘సార్’ అనే చిత్రాన్ని చేశాడు.

ఇది నిజంగా గొప్ప సినిమా అనే ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కూడా రూ.120 కోట్ల వరకు వసూళ్లను సాధించింది.వీరి బాటలోనే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్(బుజ్జి), ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి కూడా కూడా తమిళ స్టార్ హీరోలైన సూర్య, కార్తీ లను పట్టేశారు. అంతకు ముందు మన ‘జాతి రత్నం’ అనుదీప్ కేవీ కూడా శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే సినిమా చేశాడు. అది మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.

ఇక తాజాగా ‘రాధే శ్యామ్’ దర్శకుడు రాధా కృష్ణకుమార్ కూడా తమిళ హీరోని పట్టేశాడు. గత ఏడాది ‘రాధే శ్యామ్’ చిత్రంతో ప్రభాస్ కు మెమొరబుల్ డిజాస్టర్ ను కట్టబెట్టి ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన రాధా కృష్ణకుమార్.. తర్వాత మళ్ళీ గోపీచంద్ తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘జిల్’ అనే సినిమా వచ్చింది. కానీ గోపి ఇప్పుడు ఖాళీ లేకపోవడంతో ఈ రాధా కృష్ణ కుమార్ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు.

అయితే ఇతను సైలెంట్ గా వెళ్ళి శివ కార్తికేయన్ ను పట్టేసాడు. ఇటీవల చెన్నై వెళ్లి అతన్ని కలిసి ఓ కథ వినిపించాడు రాధా (Radha Krishna). అది శివ కార్తికేయన్ కు బాగా నచ్చింది. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus