పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కృష్ణంరాజు, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రూపొందిన పాటలు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపించింది.రెండో రోజు కలెక్షన్లు కష్టమే అనుకున్న తరుణంలో రెండో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబట్టి అందరికీ షాకిచ్చింది. బహుశా అడ్వాన్స్ బుకింగ్స్ మహత్యం అనుకుంటాను.
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.57.79 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.142.21 కోట్ల షేర్ ను రాబట్టాలి.
మొదటి రోజు డివైడ్ టాక్ రావడం, పైగా ‘సాహో’ కి దక్కినన్ని థియేటర్లు ఈ చిత్రానికి దొరక్కపోవడంతో మొదటి రోజు దాని స్థాయి వసూళ్ళను ఈ మూవీ రాబట్టలేకపోయింది. కానీ మొదటి అనుకున్నదానికంటే ఈ మూవీ బెటర్ గానే రాణించింది. ఆదివారం కూడా మంచి వసూళ్ళు నమోదయ్యే అవకాశం ఉంది. ఎటొచ్చీ సోమవారం నుండీ ఈ చిత్రం పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.