Radhe Shyam: రాధేశ్యామ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ర‌సూల్!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ థియేటర్లలో రిలీజ్ కావడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించగా విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో ప్రభాస్, పూజా హెగ్డే అద్భుతంగా నటించారని ఈ సినిమా ట్రైలర్లను చూసి ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. ప్రేమకు, విధికి మధ్య జరిగే యుద్ధంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వగా హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అద్భుతమైన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కిందని ఈ దశాబ్దంలోని అత్యుత్తమ ప్రేమకథలలో రాధేశ్యామ్ ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. 5 నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ చేసి ఈ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేశారంటే ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రాధాన్యత ఏంటో సులువుగానే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా గురించి సౌండ్ డిజైనర్ ర‌సూల్ పొకుట్టి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

టైటానిక్ క్లైమాక్స్ ను తలదన్నేలా రాధేశ్యామ్ క్లైమాక్స్ ఉండనుందని రసూల్ పొకుట్టి తెలిపారు. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తో కూడా తాను ఈ విషయాన్ని చెప్పానని రసూల్ పొకుట్టి అన్నారు. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియ‌న్ అయిన రసూల్ పోకుట్టి తన కామెంట్లతో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలను పెంచేశారు. రాధేశ్యామ్ రిలీజైన తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. అయితే దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాత్రం ఈ సినిమాకు టైటానిక్ కు పోలికలు లేవని చెబుతున్నారు.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ ను నిర్మించారు. సాహో సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా రాధేశ్యామ్ తో ప్రభాస్ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus