రాధేశ్యామ్ తర్వాత రెచ్చిపోతున్న ప్రభాస్..!

రెబల్ స్టార్ ప్రభాస్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర్లేదు. ఎందుకంటే, ఫస్ట్ సినిమా ఈశ్వర్ నుంచే సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి సినిమాలు ప్రభాస్ కెరియర్ ని పూర్తిగా మార్చేశాయి. మాస్ హీరోని చేశాయి. ఇక బాహుబలి ఇచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో పునర్జన్మ నేపథ్యంలో స్టోరీ చేస్తున్నా కూడా ఇందులో రెండు యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి ఊపిస్తాయని చెప్తున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ యాక్షన్ పీక్స్ లో ఉండబోతోంది. డైరెక్టర్ ఓం రౌత్ తో కమిట్ అయిన ఆదిపురుష్ సినిమా హెవీ బడ్జెట్ తో కిక్ ఇస్తుంటే, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కమిట్ అయిన సలార్ సినిమా మాస్ కి మంచి మజాని ఇస్తోంది. ఈ రెండు సినిమాలు ఎనౌన్స్ అయినప్పటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ మీసాలు తిప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంకో మేటర్ ఏంటంటే, ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా కూడా యాక్షన్ పీక్స్ లో ఉంటుందట. అందుకే, ఈ సినిమాని పాన్ ఇండియన్ మూవీగా చేస్తున్నానని డైరెక్టర్ ఒక ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే.

దీపికా పదుకునే, అమితాబచ్చన్ లకి కూడా ప్రభాస్ తో ఈక్వల్ గా క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నాడు దర్శకుడు. అంతేకాదు, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని అందుకే హీరోగా ప్రభాస్ అయితేనే పర్ఫెక్ట్ యాప్ట్ అని డిసైడ్ అయ్యాడమని చెప్తున్నాడు. మే నెల నుంచి రెగ్యులర్ గా షూటింగ్ స్టార్ట్ కాబోతోందని, దీనికి సంబంధించిన సెట్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నామని చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. అంతేకాదు, ఈ వరుస సినిమాల వల్ల ప్రభాస్ కి బాలీవుడ్ లో మార్కెట్ కూడా పెరిగిపోతోంది. అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus