Radhe Shyam New Trailer: ఫైట్లు లేవేమో కానీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి..!

‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ వంటి యాక్షన్ మూవీ చేసి హైప్ పెంచిన ప్రభాస్.. ‘రాధే శ్యామ్’ వంటి లవ్ స్టోరీ చేస్తున్నాడు ఏంటి ఎటువంటి ఫైట్లు లేకుండా అని చాలా మంది అనుకున్నారు. కానీ సినిమాలో విషయం చాలా ఉందని విడుదల చేసిన ప్రోమో, గత ట్రైలర్, పాటలు చెప్పాయి. కానీ ఇప్పుడు విడుదల చేసిన కొత్త ట్రైలర్ సినిమా పై అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేసే విధంగా ఉందని చెప్పాలి. ఇది ఇప్పటివరకు వచ్చిన ప్రేమ కథా చిత్రం కాదు. ఓ మ్యాజికల్ లవ్ స్టోరీ. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం హాలీవుడ్ ను సైతం ఆకర్షించేలా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే :

‘మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి’… అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.

‘చెయ్యి చూసి ఫ్యూచర్ ని, వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పేస్తావా?’ అంటూ ప్రత్యర్థి ప్రభాస్ ను కోప్పడుతూ అడగడం కూడా క్యూరియాసిటీని పెంచే అంశమే…!

‘ఈయన ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా?’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది.’

‘ఇంకొకసారి చెయ్యి చూడు… అంటూ జగపతి బాబు పాత్ర ప్రభాస్ ను బెదిరిస్తుంటే
నాకు రెండో సారి చూసే అలవాటు లేదు అంటూ ప్రభాస్ ధీమాగా చెబుతుండడం’ హీరోయిజాన్ని ఈ విధంగా కూడా ఎలివేట్ చేయొచ్చా అన్నట్టు ఉంది.

‘స్పోర్ట్స్ వద్దు’ అంటూ ప్రభాస్ ట్రైన్లో ఒక అమ్మాయికి చెప్పడం .. ఆ సీన్ కు సంబంధించిన విజువల్ కూడా బాగుంది.

‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’.. అంటూ హీరోయిన్ పూజా హెగ్డే చెప్పే డైలాగ్ ప్రేరణ పాత్రలో ఎమోషన్ ఎంత డెప్త్ లో ఉందో తెలియజేస్తుంది.

‘ప్రేమకి విధికి మధ్య జరిగే యుద్ధమే’ అంటూ చివర్లో రాజమౌళి వాయిస్ ను కూడా మనం వినొచ్చు.

మొత్తంగా ‘రాధే శ్యామ్’ కొత్త ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్,మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉన్నాయి. విడుదల తేదీ అయిన మార్చి 11కోసం అందరూ ఎంతో ఆసక్తిగా చూసేలా ఈ ట్రైలర్ చేస్తుందని చెప్పొచ్చు.గోపికృష్ణా మూవీస్ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!


‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus