అక్టోబర్ 13కి ఇంకా సరిగ్గా ఏడు నెలలు ఉంది. అంటే 224 రోజులు, అనగా 5376 గంటలు. 5377వ గంట నుంచి నమోదయ్యే రికార్డులు, సృష్టించబడే కొత్త రికార్డుల గురించి ఎలాగో అప్పుడు మాట్లాడుకుంటాం. అలా మాట్లాడుకోవాలి అంటే “ఆర్ ఆర్ ఆర్” అవుట్ పుట్ ఏస్థాయిలో ఉండాలి అనేది రాజమౌళికి తెలిసినట్లుగా మరెవరికి తెలుసు చెప్పండి. అందుకే “ఆర్ ఆర్ ఆర్”లోని ఒక్కో సీన్ ను జక్కన్న ఇంకాస్త గట్టిగా చెక్కుతున్నాడు.
ఎన్టీఆర్-రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ఆర్ ఆర్ ఆర్” క్లైమాక్స్ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ క్లైమాక్స్ ఫైట్ కోసం రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నిక్ పోవెల్ ను రంగంలోకి దింపాడు. హాలీవుడ్ లో “గ్లాడియేటర్, బౌర్న్ ఐడెంటిటీ” వంటి చిత్రాల ఫేమస్ అయిన నిక్ పోవెల్ రజనీ “2.0”, కంగనా “మణికర్ణిక” చిత్రాలకు స్టంట్ మాస్టర్ గా వర్క్ చేశాడు.
రీసెంట్ గా ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రానికి కూడా నిక్ స్టంట్ కొరియెగ్రఫీ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో అదిరిపోయే క్లైమాక్స్ ను డిజైన్ చేశాడు నిక్. “బాహుబలి 2″ క్లైమాక్స్ ను మించిన స్థాయిలో ‘ఆర్ ఆర్ ఆర్” క్లైమాక్స్ ఫైట్ ను ఉంటుందని తెలుస్తుంది. మరి రాజమౌళి మ్యాజిక్ ను వెండితెరపై చూడాలంటే 224 రోజులు ఆగాల్సిందే.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!