Prabhas: ఫైట్స్ లేవు.. విలన్ లేడు.. ‘రాధే శ్యామ్’ పెద్ద రిస్కే..!

ప్రభాస్ అంటేనే యాక్షన్ సీన్లకి అడ్రెస్ గా నిలుస్తుంటారు. అతను పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అంటే దానికి ప్రధాన కారణం… రాజమౌళి అతనితోనే యాక్షన్ యాంగిల్ ను దేశమంతా ప్రెజెంట్ చేయడం వల్లనే. ఏ హీరో ఫైట్ చేసినా ఎంతో కొంత అతిశయోక్తి అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభాస్ ఫైట్స్ చేస్తుంటే… అతని కటౌట్ కు తగ్గట్టుగా.. కరెక్ట్ గా అనిపిస్తుంటుంది. ‘సాహో’ హిందీలో హిట్ అయ్యిందంటే దానికి కూడా ప్రధాన కారణం అదే..!

అయితే ఈసారి మాత్రం ప్రభాస్ పెద్ద రిస్కే చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ అనేది కంప్లీట్ లవ్ స్టోరీ అని షూటింగ్ మొదలైనప్పుడు చెప్పారు. కానీ ఇది మేజికల్ లవ్ స్టోరీ అని తెలిపి అందరినీ సర్ప్రైజ్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ మరింతగా ఆసక్తిని పెంచింది. అయితే ఈ మూవీలో ఫైట్లు ఉండవు అంటేనే అభిమానులు నిరాశ చెందారు. దర్శకుడేమో ‘ఫైట్లు ఎందుకు ఉంటాయి ఇందులో విలన్ ఉంటేనే కదా.. ఫైట్లు ఉండడానికి’ అంటూ మరో షాక్ ఇచ్చాడు.

దీంతో ప్రభాస్ పెద్ద రిస్క్ చేస్తున్నట్టే..! ప్రేమకి విధికి జరిగే యుద్ధమే ఈ ‘రాధే శ్యామ్’ అని ట్రైలర్లో అందుకే చెప్పించారు. ఈ సినిమాలో అన్నీ ఆశ్చర్యకరమైన సన్నివేశాలే ఉంటాయట. ప్రేక్షకులందరినీ మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళడమే ‘రాధే శ్యామ్’ థీమ్. అది జరిగితే విజయం సాధించినట్టే అని టీం అంటుంది. ఈ చిత్రం క్లైమాక్స్ కు ఏకంగా రూ.70 కోట్లు పెట్టారట. ఇక్కడ ప్రభాస్ చేత ఫైట్ చేయించకుండా.. మొత్తం వి.ఎఫ్.ఎక్స్ టీం తోటే ఫైట్ చేయించాడు రాధాకృష్ణ. మరి ఈ మూవీ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus