నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ ‘లయన్’ చిత్రాలతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది రాధికా ఆప్టే. అంతేకాదు రజినీ కాంత్ కు జోడీగా ‘కబాలి’ చిత్రంలో కూడా నటించింది. పెద్ద సక్సెస్ ఫుల్ చిత్రాలేమీ లేనప్పటికీ అడపా.. దడపా చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతుంది. అంతే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఈమె బోల్డ్ ఆటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అందుకు తగినట్టుగానే వివాదాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ విషయం పక్కన పెడితే.. రాధికా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరలవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీ గురించి రాధికా చెప్పిన సంగతుల పై ప్రశంసల జల్లు కురుస్తుంది. రాధికా ఆప్టే మాట్లాడుతూ… “సినీ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ.. ట్యాలెంట్ ఉంటేనే వారు స్టార్లు అవుతారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా వున్నారు. మరికొంతమంది బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి కూడా స్టార్స్ కాలేకపోయారు. అందుకే ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన స్టార్స్ అవుతారని కాదు.. ట్యాలెంట్ కష్టపడి పనిచేసే వాళ్ళే స్టార్స్ అవుతారు. ఇక ఇండస్ట్రీలో కూడా అందరూ ఒకేలా ఉండరు. ఆడవాళ్ళు లైంగిక వేదింపులకు గురవుతున్న సంగతి నిజమే కానీ.. అది కాస్టింగ్ డైరెక్టర్స్ వల్లే ఎక్కువగా జరుగుతుంది. ఒక సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే కాస్టింగ్ డైరెక్టర్స్ కొందరు నీచంగా ప్రవర్తిస్తుంటారు. వారి వల్లే ఇండస్ట్రీలో అందరికీ చెడ్డ పేరు వస్తుంది.రెమ్యూనరేషన్ విషయంలో కూడా హీరో కి ఎక్కువ ఉంటుంది.సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోకి 200 కోట్ల కలెక్షన్లు రాబట్టగల సత్తా ఉంటుంది. అదే నాలాంటి హీరోయిన్ కు కోటి వరకూ వసూళ్ళు రాబట్టే అవకాశం ఉంటుంది. అలా అని సల్మాన్ రెమ్యూనరేషన్ నేను అడిగితే అది కరెక్ట్ కాదు. హీరోయిన్ రేంజ్ హీరోయిన్ కి ఉంటుంది.. ఉండాలి. అయితే సినిమాల్లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో మగవారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి ఆడవారికి తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే అది చాలా తప్పు. సినిమాలో ప్రాముఖ్యత సహనటీనటులందరికీ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో అలా చేయకూడదు” అంటూ చెప్పుకొచ్చింది.