సీనియర్ నటీమణులలో ఒకరైన రాధిక (Radhika) ప్రస్తుతం ఎక్కువగా సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శనివారం రోజున జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమానికి రాధిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పి.రాజశేఖర్ రాధికకు 2024 విశిష్ట మహిళా ప్రతిభ పురస్కారాన్ని ఆమెకు అందజేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ తెలుగులో అగ్ర హీరోలైన (Akkineni Nageswara Rao) ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవిలతో (Chiranjeevi) ఎక్కువ సినిమాలలో నటించానని అన్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలను తాను చూస్తూ ఉంటానని తారక్ నటన బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ గురించి రాధిక చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. సీనియర్ నటీమణులలో ఒకరైన ఖుష్బూ (Khushbu) సైతం జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఎంతో అనుభవం ఉన్న నటీమణులు తారక్ నటనను మెచ్చుకుంటున్నారంటే తారక్ టాలెంట్ ఏంటో సులువుగా అర్థమవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ ను సరిగ్గా వాడుకునే దర్శకులు లేరని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సరైన ప్రాజెక్ట్ లతో తారక్ తో సినిమాలను తెరకెక్కిస్తే క్రియేట్ అయ్యే రికార్డులు మాత్రం మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి భవిష్యత్తులో తారక్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేసేలా తారక్ భవిష్యత్తు సినిమాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో తారక్ పారితోషికం ఉంది. తారక్ ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.