ఈ రోజుల్లో ప్రతి మగాడు ఇద్దరు ముగ్గురిని ప్రేమిస్తున్నారు: రాధిక

వెండితెర సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తాజాగా లవ్ టుడే సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా నవంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటి రాధిక శరత్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. లవ్ టుడే సినిమా కాన్సెప్ట్ పెళ్లి చేసుకునే అమ్మాయి అబ్బాయి

ఒకరోజు మొత్తం వారి ఫోన్లు మార్చుకొని ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అని నేపథ్యంలో ఈ సినిమా తెరికేక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక అబ్బాయి ఒకే అమ్మాయిని ప్రేమించడు అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే రాధిక ఈ సినిమాలో అబ్బాయి పాత్ర గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చలకు దారి తీసారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒకప్పుడు ఒక మగాడు ఓకే మహిళతో సంబంధం పెట్టుకుని ఉండేవారు

అయితే ప్రస్తుతం అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉన్నారని ఈమె తెలిపారు. ప్రస్తుతం కాలంలో ఉన్నటువంటి యువకులు ఒక్కొక్కరు ఇద్దరు లేదా ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తున్నారంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మగవారిలో ఎవరైనా సరే నాకు ఒక్కరే అని చెప్పే ధైర్యం ఉందా అంటూ ఈమె ప్రశ్నించారు. రాధిక ఇలా ప్రశ్నించడంతో వెంటనే అక్కడున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి తాను ఒక్కడే అంటూ సమాధానం చెప్పారు.

ఈమాటకు రాధిక మీరు ఒక్కరే కాని మీ పక్కన ఇద్దరు అంటు తన పరువు తీసింది. ప్రస్తుతమున్న మగాళ్ళలో ఏ ఒక్కరు కూడా కేవలం ఒక అమ్మాయి గురించి మాత్రమే ఆలోచించడం లేదని అలా ఆలోచించేవారు చాలా అరుదుగా ఉన్నారని తెలిపారు. ఒకవేళ తాను ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నానని ఎవరు చెప్పినా వాళ్ళు అబద్ధం చెబుతున్నట్టేనని రాధిక చేసినటువంటి ఈ కామెంట్స్ విన్నటువంటి యువకులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus