బెంజ్ కారు కొనుగోలు చేసిన రాహుల్.. ట్రోల్స్ మొదలు..!

  • January 7, 2020 / 08:41 PM IST

తెలుగు ‘బిగ్ బాస్’ మొదటి రెండు సీజన్లు ముగిసిన తర్వాత.. ఆయా సీజన్ కంటెస్టెంట్లకు కానీ.. విన్నర్ లకు కానీ సినిమాల్లో ఛాన్స్ లు రావడం చాలా అరుదుగా జరిగింది. మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీని కానీ.. రెండో సీజన్ విన్నర్ కౌశల్ ను కానీ.. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కు మాత్రం ఇప్పటికీ సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈయన అదృష్టం ఏంటో కానీ పెద్దగా కష్టపడకుండానే ‘బిగ్ బాస్ 3’ విన్నర్ అయిపోయాడు. ఇతని ‘జెన్యూనిటీ’ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.

‘ఇక మిడిల్ క్లాస్ అబ్బాయిని.. సొంతంగా ఓ ఫ్లాట్ ను కొనుక్కోవాలి… ఓ సెలూన్ కూడా పెట్టాలి.. వృత్తిని మరిచిపోకూడదు’ అంటూ రాహుల్ పలుమార్లు షో లో చెప్పుకొచ్చే వాడు. ఈ కామెంట్స్ ప్రేక్షకుల్ని బాగా అట్రాక్ట్ చేసాయి. ఎక్కువ ఓట్లు పడేలా చేసాయి. విన్నర్ అయ్యి బయటకి వచ్చాక రాహుల్ కి సినిమాల్లో పాడే అవకాశాలు బాగా వస్తున్నాయి. కృష్ణ వంశీ ‘రంగ మార్తాండ’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ బెంజ్ కారుని కొనుగోలు చేసాడు రాహుల్. అంతేకాకుండా ఓ కాస్ట్లీ సెలూన్ ను కూడా ఓపెన్ చేసాడు. దీంతో మిడిల్ క్లాస్ అబ్బాయిలా నటించింది సింపతే కోసమా. ఇల్లు కొనుక్కోవాలి అంటూ అబద్దాలు ఎందుకు అంటూ కొందరు నెటిజన్లు రాహుల్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీనికి రాహుల్ క్లారిటీ ఇచ్చాడు… ‘ముందు ఓ ఫ్లాట్ ను కొన్నాను.. రెడీ అవ్వడానికి ఓ 6,7 నెలలు వరకూ సమయం పడుతుంది.’ అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి.. దానిని క్యాష్ చేసుకుంటున్నాడు.. అంతేకాని చేట్ చేసాడు అని కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదేమో..!

1

2

3

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus