రాహుల్ సిప్లిగంజ్.. ‘బిగ్ బాస్3’ మొదలవ్వక ముందు ఈ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ ‘బిగ్ బాస్3’ టైటిల్ విన్నర్ అయ్యాడు. షో లో ఇతను చాలా ఫన్నీగా ఉంటూ పాటలు పాడుతూ ప్రేక్షకుల్ని అలరించాడు. మొదట సరిగా టాస్క్ లు ఆడకపోయినప్పటికీ.. తరువాత బాగా ఆడేవాడనే చెప్పాలి. ఇక శ్రీముఖి తనని టార్గెట్ చేయడంతో సింపతీ కూడా పెరిగి ఈయనకి మరింత ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉండాగా అసలు రాహుల్ ‘బిగ్ బాస్’ విన్నర్ అయ్యాడు.. ఇది కాకుండా అతనికి ‘బిగ్ బాస్’ వాళ్ళు ఎంత పారితోషికం ఇచ్చారు అనేదాని పై చర్చ మొదలైంది.
శ్రీముఖి పెద్ద పాపులర్ యాంకర్.. అందులోనూ ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్లో ఉంది. కాబట్టి ఈమెకు రోజుకి 1 లక్ష వరకూ ఇచ్చారని తెలుస్తుంది. అలా ఈమె 15 వారాలకి గాను 1 కోటి పైనే రాబట్టుకుంది సమాచారం. అయితే రాహుల్ కి మాత్రం శ్రీముఖి స్థాయిలో రెమ్యునరేషన్ లేదట. అతనికి విన్నర్ కాబట్టి 50 లక్షలు వచ్చినప్పటికీ.. పారితోషికం పరంగా చూసుకుంటే అతనికి 45 లక్షలు మాత్రమే లభించినట్టు తెలుస్తుంది. ఇక టాక్స్ లు, అన్నీ పోగా అతనికి 70 నుండీ 75 లక్షల వరకూ మాత్రమే దక్కిందని రాహుల్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ‘బిగ్ బాస్2’ టైం లో కూడా విన్నర్ కౌశల్ కంటే గీతామాధురి పారితోషికం లెక్కన ఎక్కువ రాబట్టుకుందని ఈసారి కూడా అలాగే జరిగిందని తెలుస్తుంది.