టాలీవుడ్‌లో రాజ్ తరుణ్ (Raj Tarun) , లావణ్య వివాదం ఎప్పుడూ క్లైమాక్స్‌కి చేరుతుందా అనే సందేహం నెలకొంది. గత ఏడాది నుంచి ఈ కేసు చుట్టూ అనేక ఆరోపణలు, వివాదాలు చోటుచేసుకున్నాయి. లావణ్య అతని మీద ప్రేమ పేరుతో మోసం చేశాడని, అబార్షన్ చేయించాడని, డ్రగ్స్‌కి కనెక్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాదు, కోర్టులో పలు సాక్ష్యాలు కూడా సమర్పించింది. కానీ ఇప్పుడు ఆమె మాటల్లో వచ్చిన మార్పు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఇటీవల లావణ్య చేసిన ఒక కామెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పేలా చేస్తోంది. గతంలో రాజ్ తరుణ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె, ఇప్పుడు కేసును వెనక్కి తీసుకుంటానని, అతని కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానని ప్రకటించడం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆమె నిజంగా కేసును వెనక్కి తీసుకుంటుందా ఎందుకు ఒక్కసారిగా తన స్టాండ్ మార్చింది అన్న సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది అంత సులభం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఒకసారి కోర్టులో కేసు దాఖలైతే, న్యాయవ్యవస్థ దాన్ని పరిశీలించాల్సిందే. లావణ్య వ్యక్తిగతంగా వెనక్కి తీసుకున్నా, కోర్టు దాన్ని ఆమోదించాలంటే సరైన కారణాలు ఉండాలి. ముఖ్యంగా ఆమె సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాదు, ఈ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన అంశం కూడా ఉందని, అందువల్ల విచారణ పూర్తయ్యే వరకు ఇది ఇంత తేలికగా పరిష్కారం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇక రాజ్ తరుణ్ విషయానికి వస్తే, ఈ వివాదం తర్వాత అతను పూర్తిగా మీడియా దూరంగా ఉంటూ, తన సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
వరుస సినిమాల్లో నటిస్తున్నా, ఎవ్వరూ ఊహించని విధంగా పబ్లిక్ ఈవెంట్స్‌కి మాత్రం దూరంగా ఉంటున్నాడు. లావణ్య ఇప్పుడిప్పుడే తన మాట మార్చినప్పటికీ, అతను దీనిపై ఏ విధంగా స్పందిస్తాడో అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, లావణ్య ఒక్కసారిగా తన మాటలు మార్చడం, రాజ్ తరుణ్ కేసును వెనక్కి తీసుకునేందుకు సిద్దపడుతున్నట్లు అనిపించడం ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. కానీ, నిజంగా కోర్టు ఈ కేసును డిస్మిస్ చేస్తుందా లేక కొత్త మలుపు తిరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.