కెమెరాని చూస్తూ.. యాక్షన్ కట్ చెబుదామని అనుకున్నవాడు కాస్త.. నేరుగా యాక్షన్ లోకి దూకేశాడు. అలాఅని పూర్తిగా కెమెరాకి కొత్త కూడా కాదు. లఘు చిత్రాల్లో సుమారు అర్థ శతకం పూర్తి చేసిన అనుభవజ్ఞుడే. వస్తూ వస్తూనే వరుస విజయాలు అందుకుని ‘హ్యాట్రిక్ హీరో’ అనిపంచుకున్నాడు. అయితే కుర్రాడు కదా స్పీడ్ పెంచబోయి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అతడు ఈపాటికే మీ ఊహల్లో మెదిలాడు కదూ.. అవును మన రాజ్ తరుణే.గత రెండు సినిమాల అనుభవాల నుండి కోలుకుని ప్రస్తుతం ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణతో ‘కేటుగాడు ఉన్నాడు జాగ్రత్త’, తొలి చిత్ర దర్శకురాలైన సంజన రెడ్డి తెరకెక్కిస్తున్న ‘రాజుగాడు – యమా డేంజర్’ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఈ సినిమాలతో బిజీగా ఉన్న ఇతగాడు ఇటీవల నిఖిల్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో ఫంక్షన్ కి విచ్చేశాడు. అక్కడ నిఖిల్ గురించి చెబుతూ “ఏదో ఒక సినిమా అని కాకుండా, మంచి సినిమాలు చేస్తుంటాడు” అని అన్నాడు. ఈ మాటని పట్టుకుని ఆలా మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడు గనుకనే హిట్ కొడుతున్నాడని కొందరు ఈ కుర్ర హీరోపై సెటైర్లు వేయడం మొదలెట్టారు. సెటైర్ సంగతి పక్కనపెడితే నిఖిల్ నుండి రాజ్ తరుణ్ ఈ విషయం నేర్చుకోవడం మంచిది. లేకుంటే పదేళ్ల క్రితం కొత్తల్లో హిట్లు కొట్టి ఇలానే పేరు తెచ్చుకున్న వాళ్ళ లిస్ట్ లో రాజ్ తరుణ్ కూస్తో చేరిపోవాల్సి వస్తుంది. అన్నట్టు ఇదే వేదికపై ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ తో తన తర్వాతి చిత్రం ఉందనున్నట్టు తెలిపాడు. ఈ సినిమా ఫలితం బట్టి చెబుతా అనకుండా సినిమా విడుదలకు ముందే రాజ్ తరుణ్ ఇలా ప్రకటించాం విశేషం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.