మాస్ మహారాజ్ రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘రాజా ది గ్రేట్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కొంత గ్యాప్ తర్వాత రవితేజ నటించిన సినిమా, అలాగే మొదటిసారి ఈ సినిమా కోసం అతను పంధా మార్చి.. అంధుడి పాత్రని పోషించడం వంటి వాటితో కూడా .. రిలీజ్ కి ముందు నుండి ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే మొదటి షోతో ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
క్రిటిక్స్ ఈ సినిమా పై విమర్శలు గుప్పించారు. లాజిక్స్ కి చాలా దూరంగా ఈ మూవీ ఉంది అంటూ ఘాటుగా స్పందించారు. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. 2017 అక్టోబర్ 10 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
11.35 cr
సీడెడ్
4.15 cr
ఉత్తరాంధ్ర
3.91 cr
ఈస్ట్
2.09 cr
వెస్ట్
1.66 cr
గుంటూరు
1.90 cr
కృష్ణా
1.82 cr
నెల్లూరు
o.95 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
27.83 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
2.30 cr
ఓవర్సీస్
0.91 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
31.04 cr (షేర్)
‘రాజా ది గ్రేట్’ (Raja The Great) చిత్రం రూ.30 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.31.04 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.1.04 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.