ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ కోర్టుల్లో పిటిషన్లు సైతం దాఖలైన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలను జక్కన్న సూపర్ హీరోలుగా చూపించడంపై ట్రైలర్ రిలీజైన సమయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన తర్వాత కొందరి నుంచి ఈ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఫిక్షన్ అని జక్కన్న చెబుతున్నా నిజమైన స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలకు ఫిక్షన్ ను ఎలా జోడిస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ లో చరిత్రను వక్రీకరించారని వ్యక్తమైన కామెంట్ల గురించి ఘాటుగా స్పందించారు. బాహుబలి2 సినిమా రిలీజ్ తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను చేయాలని అనుకున్నారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా కథ ఫిక్స్ కాకముందే కొన్ని కాంబినేషన్లను పరిశీలించామని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్ఆర్ఆర్ కథను సిద్ధం చేసిన తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లను రామరాజు, భీమ్ పాత్రలకు ఎంపిక చేశామని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ భీమ్, రామరాజు చరిత్ర కాదని ఆయన అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీర శూరకర్ణ సినిమాలో కృష్ణుడు కర్ణుడితో “నువ్వు ద్రౌపది మీద మోజు పడ్డావ్ కదా.. ఆమె నిన్ను ఆరో భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది” అని చెబుతాడని వాస్తవానికి మహాభారతంలో ఈ ప్రస్తావన ఉండదని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. దానవీర శూరకర్ణ సినిమాలో కర్ణుడు, ద్రౌపది పాత్రలను తప్పుగా చూపించారని అలా చూపించడం వక్రీకరించడం కిందికి వస్తుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో తాము అలా చేయలేదని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ గురించి వైరల్ అవుతున్న విమర్శలకు ఒక విధంగా విజయేంద్ర ప్రసాద్ చెక్ పెట్టారని చరణ్, తారక్ అభిమానులు చెబుతున్నారు. అల్లూరి, కొమురం భీమ్ పాత్రలను తీసుకుని కొత్త కథ సృష్టించామని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.