SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి కొత్త స్కెచ్‌.. ప్లాన్‌ అదిరిందిగా!

‘బాహుబలి’ సినిమాతో పాన్‌ ఇండియా దర్శకుడిగా మారిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ టార్గెట్‌ వరల్డ్‌ డైరక్టర్‌. దీని కోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సినిమా మహేష్‌బాబు 29వ సినిమా అనే విషయం తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ఈ సినిమాలో హాలీవుడ్‌ హీరోయిన్‌ నటించనుందని. దీనిపై క్లారిటీ లేదు కానీ.. పక్కాగా అవకాశం ఉందని మాత్రం చెబుతున్నారు.

రాజమౌళి ఇప్ప‌టివ‌ర‌కు చేసిన సినిమాల‌న్నీ ఓ ఎత్తు అయితే #SSMB29 సినిమా మ‌రో ఎత్తు అని చెబుతున్నారు. ఈ మేరకు రాజమౌళి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌసెలతో కలసి పని చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు టెక్నీషియ‌న్లతోనూ చేతులు క‌లుపుతున్నారు. హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో రాజమౌళి చేతులు క‌లిపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ‌ హాలీవుడ్ న‌టీన‌టుల‌ను ఈ సినిమాలో న‌టింప చేయ‌టానికి ఈ ఏర్పాట్లు అని చెబుతున్నారు.

మరోవైపు ఈ సినిమాలో ‘థోర్’ సినిమా నటుడు క్రిస్ హెమ్స్ వ‌ర్త్ నటిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడు హీరోయిన్‌గా హాలీవుడ్ భామ‌ను రంగంలోకి దించాలని చూస్తున్నారట రాజమౌళి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను చేసి వ‌చ్చే ఏడాది ప్ర‌థమార్ధం సినిమాను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ సినిమా జేమ్స్ బాండ్‌, ఇండియానా జోన్స్ త‌ర‌హాలో ఉంటుందని చెబుతున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.ఎల్.నారాయ‌ణ ఈ సినిమాను నిర్మిస్తారు.

ఈ సినిమాకు రూ.500 కోట్లు ఖర్చు పెడతారని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్నారు. ఆ సినిమా ఇప్పటికే మొదలైన రెండో షెడ్యూల్‌ ఇంకా మొదలవ్వడం లేదు. ఈ సినిమా పూర్తయ్యాకనే రాజమౌళి సినిమా మొదలవుతుంది. రాజమౌళి ఈలోపు మహేష్‌ కోసం కథ, కథనం సిద్ధం చేస్తారని టాక్‌.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus