లాక్ డౌన్ ప్రకటనతో మెగా ఫోన్ పక్కన పెట్టి ఇంటికే పరిమితం అయ్యారు రాజమౌళి. ఆ మధ్య కరోనా బారిన పడిన ఆయన త్వరగానే కోలుకోవడం జరిగింది. చాలా కాలం తరువాత రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆర్ ఆర్ ఆర్ విశేషాలతో పాటు, తన ఆరోగ్యం, భార్య రమాతో కలిసి వెళ్లిన కర్ణాటక టూర్ గురించి మాట్లాడాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలవనుందని తెలిపారు. రెండు నెలల షూటింగ్ సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేశామని అన్నారు.
ఐతే ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఇప్పుడే చెప్పలేం, పరిమితుల మధ్య షూటింగ్ లో ఎదురయ్యే ప్రాక్టీకల్ ప్రాబ్లమ్స్ తెలిసిన తరువాత ఒక అంచనాకు వస్తాను అన్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో గురించి కూడా రాజమౌళి తెలిపారు. సిద్ధం చేస్తున్నాం, త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తాం అన్నారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ నడపడం సరైన నిర్ణయం కాదు అన్నారు. గంటల తరబడి ప్రయాణం చేస్తున్న విమానాలను పూర్తి సామర్ధ్యంతో నడుపుతున్నప్పుడు సినిమా థియేటర్స్ ఏమంత ప్రమాదకరం కాదన్న భావన వ్యక్తం చేశారు.
కాగా ప్రభాస్ సినిమాలపై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటని అడుగగా, అలాంటి చిత్రాలు చేయడం మినహా ప్రభాస్ కి వేరే దారి లేదు, అతడు లాకైపోయాడు అన్నాడు. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రభాస్ కొందరికి మాత్రమే నచ్చే సినిమాలు, కథలు ఎంచుకోవడం కుదరదు అన్నారు. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ గురించి చర్చించాడా అని అడుగగా…చర్చించాడు , కానీ నేను దాని గురించి మాట్లాడలేను అన్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!