“వంగవీటి”పై జక్కన్న ఏమన్నాడు అంటే…
- December 21, 2016 / 02:04 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే….టక్కున చెప్పే పేరు..ఎస్.ఎస్ రాజమౌళి…ఇప్పటివరకూ రాజమౌళి తీసిన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు మన జక్కన్న సినిమాల విషయంలో ఎంత పక్కాగా ప్లాన్ చేస్తాడో..అయితే అదే క్రమంలో వంగవీటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “ఫ్రమ్ శివ టూ వంగవీటి” అనే ప్రోగ్రామ్ కి విచ్చేసిన దర్శకుడు రాజమౌళి….వర్మ గురించి…బెజవాడ గురించి…అంతేకాదు వంగవీటి గురించి తనదైన శైలిలో మాట్లాడాడు…ఇంతకీ జక్కన్న ఏమన్నాడు అంటే…వర్మ విషయంలో తన అనుభవాన్ని వివరిస్తూ…’మద్రాస్ లో అసిస్టెంట్లుగా చేసినవాళ్లందరికీ నమస్కారం చేయడం అలవాటు.
కానీ రాము గారికి నమస్కారం చేయడం.. గుడ్ మాణింగ్ చెప్పడం లాంటివి ఇష్టం ఉండదు. ఎలా పలకరిస్తే ఎలా రియాక్ట్ అవుతారని వందల సార్లు ప్రాక్టీస్ చేశాను. వందల మంది డైరెక్టర్లకు ఆయన ఇన్ స్పిరేషన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు….అంతేకాకుండా…”ఆల్ మై హిట్స్ యాక్సిడెంటల్ అండ్ ఆల్ మై ఫ్లాప్స్ ఆర్ ఇంటెన్షనల్” అంటూ వర్మ చేసిన కామెంట్ నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు అంటూ జోక్ చేశారు జక్కన్న…అదే క్రమంలో…బెజవాడ గురించి మాట్లాడుతూ…తనకు బెజవాడ గురించి పెద్దగా తెలీదు అని…అయితే ఈ సినిమాలోని కేరక్టర్స్ చూస్తుంటే.. నిజంగా పేపర్స్ లోను వీడియో క్లిపింగ్స్ లోను ఒరిజినల్ చూస్తున్నట్లుగా ఉంది.వంగవీటి హిట్ అవుతుందని ఆశిస్తున్నా’ అంటూ బెస్ట్ విషెశ్ తెలిపాడు రాజమౌళి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











