Rajamouli: ప్రమోషన్స్ చేసి పరువు పోగొట్టుకుంటున్న జక్కన్న.. కానీ?

స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే రాజమౌళి ఇతర హీరోల సినిమాలకు ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. తాజాగా విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జక్కన్న బ్రాండ్ ఇమేజ్ మసకబారుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కంటెంట్ లేని సినిమాలకు ప్రమోషన్స్ చేయడానికి ఓకే చెప్పి జక్కన్న తప్పు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో జక్కన్న ప్రమోట్ చేసే సినిమాలను నమ్మే పరిస్థితి ఉండదు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇతర హీరోల సినిమాలకు పబ్లిసిటీ చేయడం వల్ల కూడా జక్కన్నకు భారీగానే ఆదాయం దక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటే మాత్రం జక్కన్న భవిష్యత్తులో తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈ రీజన్ వల్లే జక్కన్న ఇతర హీరోల సినిమాలను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే.

కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025 చివర్లో లేదా 2026 మొదట్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. తన ప్రతి సినిమా భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే జక్కన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయించనున్నారని బోగట్టా.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus