టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదంటే ఇప్పుడంతా ముక్తకంఠంతో చెప్పేది.. రాజమౌళి (S. S. Rajamouli)- మహేష్ బాబు (Mahesh Babu) ..ల సినిమా గురించే.! ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి మొదటి సారి ఓ స్టార్ హీరోతో పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు అన్నీ.. అతని వల్ల స్టార్లయిన హీరోలతో..లేదంటే, చిన్న హీరోలతో, మిడ్ రేంజ్ హీరోలతో..సినిమాలు చేశాడు. ‘స్టార్ హీరోలతో పనిచేయడం అనేది పెద్ద సవాల్.. నాతో పనిచేసి స్టార్లు అయినవాళ్లతో నాకు కావాల్సింది ఏదైనా ఓపెన్ గా చెప్పగలను ..
Rajamouli
ఆల్రెడీ స్టార్స్ అయినవాళ్లు నా వర్కింగ్ స్టైల్ తో కంఫర్ట్ గా ఉండలేరు, అందువల్ల నేను వాళ్ళని ఏదీ కూడా మనస్ఫూర్తిగా అడగలేను’ అంటూ గతంలో రాజమౌళి చెప్పుకొచ్చాడు. కానీ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు కాబట్టి, తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం ఉంది. తద్వారా తెలుగు సినిమా స్టామినా మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా ఏళ్ళకి ఏళ్ళు టైం పడుతుంది.
ఓ పట్టాన రాజమౌళి కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. అందుకే రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా హీరోలు 3 ఏళ్ళు కేటాయించాల్సిందే. ఇప్పుడు మహేష్ కూడా అంతేనా. మూడేళ్లు వెయిట్ చేయాల్సిందేనా అంటే..! అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులు కూడా అది నిజమే అని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే రాంచరణ్ (Ram Charan) మాత్రం అలాంటిదేమీ జరగదు. ఇప్పుడు కోవిడ్ వంటివి లేవు కాబట్టి, ఏడాదిన్నరలో వచ్చేస్తుంది అంటూ నిన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ట్రైలర్ లాంచ్ లో చెప్పుకొచ్చాడు.
అయితే వెంటనే రాజమౌళి కలగచేసుకుని ‘బాగానే ట్రైనింగ్ ఇచ్చాను’ అంటూ చెప్పి ఓ నవ్వు నవ్వేశాడు. సో రాజమౌళి పరోక్షంగా ఈ సినిమా ఆలస్యం అవుతుందని చెప్పినట్టే అనుకోవాలి. అయితే కోవిడ్ వంటివి రాకపోయి ఉంటే.. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie) సినిమా కచ్చితంగా ఒక ఏడాది అయినా ముందు వచ్చి ఉండేది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ, మహేష్ బాబుతో చేస్తుంది హాలీవుడ్ రేంజ్ సినిమా. పైగా పక్క దేశాలకు వెళ్లి తీస్తున్నారు. సో రెండేళ్లు మినిమమ్ టైం పట్టొచ్చు.