Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » 2024లో అత్యద్భుతంగా అలరించిన కథానాయకులు!

2024లో అత్యద్భుతంగా అలరించిన కథానాయకులు!

  • January 2, 2025 / 07:00 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024లో అత్యద్భుతంగా అలరించిన కథానాయకులు!

మాములుగా ప్రతి ఏడాది స్టార్ హీరోల (Heroes) డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. గతేడాది మాత్రం యువ కథానాయకులు విశేషంగా ఆకట్టుకున్నారు. అలరించడమే కాక ఆశ్చర్యపరిచిన కథానాయకులు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ ఏమిటో చూద్దాం..!!

Heroes

1. మహేష్ బాబు (Mahesh Babu)

ఒక హీరో పెర్ఫార్మెన్స్ అనేది సినిమా రిజల్ట్ తో సంబంధం లేని విషయం. ఒక్కో సినిమా ఫెయిల్ అయినా హీరో పెర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యాన్స్ ను విశేషంగా అలరిస్తుంది. “గుంటూరు కారం” (Guntur Kaaram) సినిమా అంటే సరిగా ఆడలేదు కానీ, రమణ పాత్రలో మహేష్ బాబు నటన & మ్యానరిజమ్స్ ను మహేష్ ఫ్యాన్స్ భీభత్సంగా ఎంజాయ్ చేశారు. “ఖలేజా” (Khaleja) తర్వాత మహేష్ బాబు కామెడీ టైమింగ్ మళ్లీ ఈ సినిమాలోనే కనబడింది. మహేష్ తదుపరి సినిమా విడుదలవ్వడానికి కనీసం మూడేళ్లు పడుతుంది కాబట్టి.. అప్పటి  వరకు మహేష్ ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ రమణగాడే.

2. తేజ సజ్జ (Teja Sajja)

చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసి, హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందిపడుతున్న తేజ “హనుమాన్”తో (Hanu Man) ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ప్యాన్ ఇండియన్ లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. బడా హీరోల సరసన నిలిచాడు. తేజ తదుపరి సినిమాల మీద ఆధారపడి ఉంటుంది అతడి స్టార్ డం.

3. రవితేజ (Ravi Teja)

మాస్ ఎంటర్టైనర్ గా రవితేజకు ఉన్న ఇమేజ్ ను ఇప్పటివరకు టచ్ చేయలేదు. అయితే.. ఈమధ్యకాలంలో మాస్ హీరోగా తన ఉనికిని చాటుకొనేందుకు రవితేజ బాగా కష్టపడుతున్నాడు. ఆ క్రమంలో క్వాలిటీ పరంగా ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సినిమా “ఈగల్” (Eagle). అనవసరమైన ఎలివేషన్స్ ఎక్కువైపోయి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది కానీ.. కరెక్ట్ గా ప్లాన్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది. కానీ.. ఈ సినిమాలో రవితేజ గెటప్ & స్టైలింగ్ భలే ఉంటాయి.

4. హర్ష చెముడు (Harsha Chemudu)

వైవా అనే షార్ట్ ఫిలింతో విశేషమైన క్రేజ్ సంపాదించుకుని సినిమాల్లో కమెడియన్ గా స్థిరపడిన వైవా హర్ష అలియాస్ హర్ష చెముడు “సుందరం మాస్టర్”తో (Sundaram Master) హీరోగా పలకరించాడు. ఈ సినిమా కమర్షియల్ గా థియేటర్లలో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు కానీ.. నటుడిగా హర్ష మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నాడు. హాస్యంతోపాటు ఎమోషన్ పండించడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో హర్ష 100 శాతం సక్సెస్ అయ్యాడు.

5. విశ్వక్ సేన్ (Vishwak Sen)

నటుడిగా విశ్వక్ సేన్ తన సత్తాను ఇప్పటికే పలుమార్లు చాటుకున్నాడు. కానీ “గామి” (Gaami) అతడి కెరీర్లో ఒక కలికితురాయిగా నిలుస్తుంది. ఈ తరహా పాత్రను యాక్సెప్ట్ చేయడమే కాక, ఆ పాత్రలో ఇమిడిపోవడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. తన శైలి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలతోపాటు ఈ తరహా ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తే బాగుంటుంది.

6. శ్రీవిష్ణు (Sree Vishnu)

ఈ ఏడాది అత్యంత వైవిధ్యమైన పాత్ర పోషించిన నటుడు శ్రీవిష్ణు. హసిత్ గోలి (Hasith Goli) దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన “శ్వాగ్” (Swag) అతడి కెరీర్లోనే రిస్కీ క్యారెక్టర్. సినిమా సరిగా ఆడకపోయినా, శ్రీవిష్ణు నటన మాత్రం హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు పోషించిన విబూధి పాత్ర అతడి కెరీర్లో ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్ర అవుతుంది.

7. సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)

ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ గా సిద్ధు జొన్నలగడ్డ నిలుస్తాడు. టిల్లు (Tillu Square) అంటే సిద్దు, సిద్ధు అంటే టిల్లు అనే స్థాయిలో క్యారెక్టర్లో ఒదిగిపోయాడు సిద్ధు. సిద్ధు నార్మల్ గా కూడా అలాగే బిహేవ్ చేయడం వల్ల అతడికి మంచి పి.ఆర్ ఏర్పడింది. ఈ స్టార్ డమ్ ను సరిగ్గా వినియోగించుకుంటే.. సిద్ధు జొన్నలగడ్డ స్టార్ హీరోగా ఎదగడంలో అడ్డంకులు ఉండవు.

8. ప్రభాస్ (Prabhas)

“బాహుబలి” (Baahubali) తర్వాత “సలార్” (Salaar) వరకు ప్రభాస్ కి సరైన సినిమా పడలేదు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ను సరిగ్గా వినియోగించుకున్న ఏకైక వ్యక్తి ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ఆ తర్వాత నాగ్ అశ్విన్ (Nag Ashwin) “కల్కి”లో (Kalki 2898 AD) కాస్త కామెడీ యాంగిల్ ను మళ్లీ అందించాడు, అయితే.. కర్ణుడిగా ప్రభాస్ ను ప్రాజెక్ట్ చేసిన విధానం మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. మామూలుగానే ప్రభాస్ కళ్ళల్లో రాజరికం తొణికిసలాడుతుంది. అలాంటిది కర్ణుడిగా ప్రభాస్ ప్రెజన్స్ అదిరిపోయింది. పార్ట్ 2 లో ఆ కర్ణుడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

9. నవదీప్ (Navdeep)

సరిగ్గా కెరీర్ ప్లాన్ చేసుకోక మరుగునపడిపోయాడు కానీ.. నవదీప్ కి ఉన్న టాలెంట్ కి, పరిచయాలకి ఎక్కడో ఉండాలి. కొన్నాళ్ల గ్యాప్ తీసుకొని 2024లో “లవ్ మౌళి” (Love Mouli) అంటూ పలకరించాడు నవదీప్. ఈ సినిమా కోసం మానసికంగానే కాక శారీరికంగానూ నవదీప్ పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఒక సగటు మగాడి మైండ్ సెట్ ను మౌళి పాత్రలో నవదీప్ రీప్రెజండ్ చేసిన తీరు అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.

10. నాని (Nani)

ప్రతి సినిమాతో తనను తాను అప్డేట్ చేసుకుంటూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, తన దర్శకులకు అండగా నిలబడడంలో ముందుంటాడు. ముఖ్యంగా.. తనకు ఫ్లాప్ ఇచ్చిన వివేక్ ఆత్రేయతోనే మళ్లీ “సరిపోదా శనివారం”తో (Saripodhaa Sanivaaram) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. నటుడిగానే కాదు వ్యక్తిగానూ 2024లో బిగ్ సక్సెస్ సాధించాడు నాని.

11. ఎన్టీఆర్ (Jr NTR)

నిజానికి మొదటిరోజు దేవరకి (Devara) వచ్చిన మిక్స్డ్ టాక్ కి సినిమా రిజల్ట్ ఏమైపోతుందో అనుకున్నారు జనాలు. కానీ.. ఎన్టీఆర్ స్టార్ డం ఈ సినిమాని నిలబెట్టింది. నటుడిగానూ అతడి కెరీర్ కి మైలురాయిగా నిలిచింది. కంటెంట్ విషయంలో కొరటాల ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా మరో బ్లాక్ బస్టర్ అయ్యేది.

12. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram )

తన మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడమే కాక.. నటుడిగా, నిర్మాతగా, కథానాయకుడిగా తన సత్తాను ప్రూవ్ చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ముఖ్యంగా నటుడిగా ఈ చిత్రంలో పోషించిన రెండు విభిన్నమైన పాత్రలు కిరణ్ అబ్బవరంలోని మరో యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది.

13. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)

మలయాళ హీరో అయినప్పటికీ.. తెలుగోళ్లు ఓన్ చేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. లక్కీ భాస్కర్ లో (Lucky Baskhar) భాస్కర్ లో దుల్కర్ నటన ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మెన్స్ లలో టాప్ 3లో ఉంటుంది. అందుకే సినిమాను కూడా అంతలా ఓన్ చేసుకున్నారు.

14. వరుణ్ తేజ్ (Varun Tej)

మట్కా (Matka) సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది కానీ.. సినిమాలో మట్కా వాసుగా వరుణ్ తేజ్ మాత్రం కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సింగిల్ షాట్ లో వాసుగా వరుణ్ తేజ్ నటన & హావభావాలు చాలా మెచ్యూర్డ్ గా ఉంటాయి.

15. అల్లు అర్జున్ (Allu Arjun)

Pushpa 2 The Rule Makers Plans New Scenes Release in Theatres (1)

పుష్ప (Pushpa)  కంటే ఎక్కువగా పుష్ప2ని (Pushpa 2: The Rule) ఓన్ చేసుకున్నారు నార్త్ జనాలు. ఇక్కడికంటే అక్కడే పెద్ద హిట్ అయ్యింది సినిమా. పుష్పరాజ్ గా అల్లు అర్జున్  నటన, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే జాతర ఎపిసోడ్ లో బన్నీ నటన చూసినవాళ్లందరూ.. అప్పుడు కాదు ఇప్పుడు రావాలి నేషనల్ అవార్డ్ అంటున్నారు.

16. అల్లరి నరేష్ (Allari Naresh)

Bachhala Malli Movie Review & Rating (1)

సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కొన్ని పాత్రలు అలా గుర్తిండిపోతాయి. అల్లరి నరేష్ పోషించిన “బచ్చల మల్లి” (Bachhala Malli) అలాంటి పాత్రే. ట్రీట్మెంట్ బాగోక సినిమా సరిగా ఆడలేదు కానీ, కాస్త బెటర్ గా ట్రీట్ చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. అయితే.. మల్లి అనే మూర్ఖుడి పాత్రలో అల్లరి నరేష్ నటన మాత్రం గుర్తిండిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Harsha Chemudu
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #Nani

Also Read

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Prem Rakshith, Prabhas: ఓకే చేశాడు సర్‌.. ఆ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ సినిమాలో ప్రభాసే నటిస్తాడా?

Teja Sajja: రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

Teja Sajja: రెండు సీక్వెల్స్‌ ఒకేసారి తెరపైకి.. సాధ్యమేనా? తేజ రిస్క్‌ చేస్తున్నాడా?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: మళ్లీ కలుద్దామంటున్న మహేష్‌.. రాజమౌళి ఇప్పుడేం ప్లాన్‌ చేశారో?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

Mahesh Babu: కారు చలాన్లు కట్టేసిన అభిమాని.. కానీ మహేష్‌ రూల్స్‌ పాటించకపోవడమేంటి?

trending news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

3 hours ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

11 hours ago

latest news

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

10 hours ago
Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

10 hours ago
Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

11 hours ago
SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version