Rajamouli, Mahesh Babu: మహేష్‌బాబుకి విలన్‌ కోసం గాలింపు మొదలు!

రాజమౌళి సినిమా అంటే షూటింగ్‌ మొదలయ్యాక ఎంత టైమ్‌ పడుతుందో చెప్పలేం అంటుంటారు. గత మూడు నాలుగు సినిమాలు ఇలాగే అయ్యాయి. అయితే మహేష్‌బాబు సినిమా విషయంలో సినిమా మొదలుపెట్టడానికే చాలా టైమ్‌ పడుతోంది. సినిమా కథ ఇంకా సిద్ధం కాలేదు. ఆ మాటకొస్తే ఓకేనే కాలేదు అని కూడా అంటున్నారు. అయితే ఇప్పుడో విషయం బయటికొచ్చింది. సినిమాకు సంబంధించి కాస్టింగ్‌ కోసం రాజమౌళి ప్రయత్నాలు మొదలుపెట్టారని. అందులో భాగంగా ముందుగా విలన్‌ ఎంపిక చేస్తారట.

రాజమౌళి సినిమా అంటే స్టార్‌ హీరో పక్కా… అయితే ఆ ఎంపిక హీరో పాత్ర కోసం మాత్రమే కాదు.. విలన్‌ పాత్ర కోసం కూడా అని చెప్పొచ్చు. పాన్‌ ఇండియా సినిమాలవైపు రాజమౌళి రాకముందు నుండే సినిమాల్లో విలన్‌గా స్టార్‌ హీరోను ఎంచుకుంటూ వస్తున్నారు. ‘ఈగ’లో సుదీప్‌ను విలన్‌గా తీసుకున్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత రెండు ‘బాహుబలి’ సినిమాల్లోనూ రానా విలన్‌ అయ్యాడు. ‘ఆర్‌ఆర్ఆర్’లో ఏకంగా ఇంగ్లిష్‌ నటులు వచ్చారు.

ఇప్పుడు మహేష్‌బాబుతో చేస్తున్న సినిమా కోసం రాజమౌళి విలన్‌ను వెతికే పనిలో ఉన్నరాట. అందులో భాగంగా బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ నుండి నటుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. నిజానికి కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ నటుల్ని కీలక పాత్రల్లో తీసుకోవడం కొత్తేమీ కాదు. త్రివిక్రమ్‌ చాలా రోజుల నుండి ఈ పని చేస్తున్నారు. దీంతో రాజమౌళి ఆ దిశగా కాకుండా బాలీవుడ్‌వైపు చూస్తున్నారని అంటున్నారు. మహేష్‌ సినిమా పాన్‌ ఇండియా కాబట్టి బాలీవుడ్‌ నటుడు అయితే బెటర్ అని చూస్తున్నారట.

పవర్‌ఫుల్ విలన్‌ పాత్ర అంటే ముందుకొచ్చే బాలీవుడ్‌ హీరోలు చాలా మందే ఉన్నారు. అందులోనూ రాజమౌళి సినిమాలో విలన్‌కి కూడా హీరో స్థాయి క్యారెక్టర్‌ ఉంటుంది. అయితే ఎవరు ఆ విలన్‌ అయ్యే హీరో అనేదే ఇక్కడ ప్రశ్న. ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా ప్రచారంలో ఆమిర్‌ ఖాన్‌ వరుసగా రెండు సార్లు పాల్గొన్నాడు. ఆ సమయంలో మహేష్‌ సినిమాలో ఆమిర్‌ విలన్‌ అవుతాడా అనే ప్రశ్న వినిపించింది. ఇప్పుడు మళ్లీ అదే మాట వినిపిస్తోంది. ఒకవేళ హిందీ నుండి హీరోయిన్‌ను తెస్తే.. తమిళం నుండి విలన్‌ను తెస్తారు అంటున్నారు. చూడాలి జక్కన్న ప్లాన్స్‌ ఏంటో.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus