ఆస్కార్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ భారీ పెట్టుబడి.. అప్పుడే మొదలైన విమర్శలు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఆస్కార్‌ అవార్డు వచ్చే పరిస్థితి లేదు కానీ.. అందులోని ‘నాటు నాటు..’ పాటకు మాత్రం అవకాశం ఉంది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆ పాట బరిలో ఉంది. దీని కోసం టీమ్‌ ఇప్పుడు చాలా కష్టపడుతోంది. ఆర్థికంగా, శారీరకంగా చాలానే ఖర్చు పెట్టారు అని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే సుమారు రూ. 80 కోట్ల వరకు డబ్బులు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇక శారీరకంగా అంటారా? హీరోలు, డైరక్టర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ తెగ తిరుగుతున్నారు.

భార‌తీయ సినిమాల‌కు ఆస్కార్ రావ‌డం అరుదైన విష‌యం. అంతేకాదు ఆస్కార్ నామినేష‌న్ పొందడమూ కష్టమే. ఒకవేళ సినిమాకు నామినేషన్‌ దొరికితే.. అవార్డు కోసం చాలా ప్రచారం చేయాలి. ‘ల‌గాన్’ సినిమాకు ఉత్త‌మ విదేశీ చిత్రం కేట‌గిరీలో నామినేష‌న్ ద‌క్కింది. కానీ అవార్డు అయితే రాలేదు. ఆ సమయంలో ఆమిర్ ఖాన్‌ మాట్లాడుతూ ‘సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలంటే భారీగా ప్ర‌మోష‌న్లు చేయాలి. కోట్లకు కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. అంత స్థోమ‌త లేకే మేం పోటీ ప‌డ‌లేక‌పోయాం’ అని చెప్పారట.

కానీ ‘ఆర్‌ఆర్ఆర్‌’ విషయంలో రాజమౌళి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే ఈ సినిమా కోసం తెగ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా అంతర్జాతీయ అవార్డులు రాగా, ఇంకొన్ని వరుసలో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో అవార్డులు కొనుక్కుంటున్నారు అనే చర్చ కూడా నడిచింది. అదంతా సమసిపోయింది అనుకుంటున్న సమయంలో అవార్డుల కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం మొదలైంది. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సైతం ఇలాంటి మాటే అన్నారు.

రూ.80 కోట్లు పెట్టి ఆస్కార్ తెచ్చుకోవాల్సిన అవస‌రం ఏమొచ్చింది అనే ప్రశ్న రావొచ్చు. దానికి ఒకటే సమాధానం. ఆస్కార్ అనేది తిరుగులేని గౌరవం. ఆ గౌరవం దక్కితే ఆ సినిమా ఎంతటి పుణ్యం చేసుకుందో అంటుంటారు. అంతటి క్రేజ్‌ ఉంది కాబట్టే.. టీమ్‌ ఇంత వ్యయప్రయాసలకు సిద్ధమైంది అంటున్నారు. అయితే ఆ ఖర్చు లెక్కలు మనం నిజంగా ఇంత అని చెప్పలేం అనుకోండి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus