Rajamouli: ప్రభాస్ ఆది పురుష్ కోసం రంగంలోకి రాజమౌళి… బొమ్మ బ్లాక్ బాస్టరే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ రాజమౌళిది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చత్రపతి బాహుబలి సినిమాలు ఎలాంటి సంచలనాలను సృష్టించాయో మనకు తెలిసిందే . ఇక ఈ సినిమాల ద్వారా రాజమౌళి ప్రభాస్ మధ్య కూడా చాలా మంచి బాండింగ్ ఏర్పడింది.ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నింటికీ రాజమౌళి సహాయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా విడుదల సమయంలో కూడా రాజమౌళి ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన విషయం మనకు తెలిసిందే.

అంతేకాకుండా ప్రభాస్ తో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే తాజాగా మరోసారి ప్రభాస్ సినిమా కోసం రాజమౌళి రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జైశ్రీరామ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఈ నెల 29 న సియా రామ్ సాంగ్ ను రీలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 6 న తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను కూడా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా అంటే రాజమౌళి రాకుండా అసలు ఉండరు.

దీంతో ఈ వేడుకకు (Rajamouli) రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారని తెలియడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడమే కాకుండా రాజమౌళి ప్రమేయం ఉంది అంటే బొమ్మ బ్లాక్ బాస్టర్ కావాల్సిందేనని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకున్న తర్వాత పలు ప్రాంతాలలో కూడా ఘనంగా పలు ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus