స్టార్ డైరెక్టర్ రాజమౌళి జనవరి నెల 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఏపీలో తగ్గిన టికెట్ రేట్ల వల్ల కొంత మొత్తం నష్టపోయే అవకాశం ఉన్నా సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తే ఎక్కువ మొత్తంలో సినిమాకు కలెక్షన్లు వస్తాయని రాజమౌళి భావిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ కు పోటీగా భీమ్లా నాయక్, రాధేశ్యామ్ రిలీజవుతున్న నేపథ్యంలో రాజమౌళికి టెన్షన్ మొదలైంది. ఏపీలో తగ్గిన టికెట్ రేట్ల వల్ల ఆర్ఆర్ఆర్ నిర్మాతకు 25 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని బోగట్టా.
రాజమౌళి పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా పవన్ అపాయింట్మెంట్ లభించలేదు. రాజమౌళి చంద్రబాబు సహాయంతో పవన్ భీమ్లా నాయక్ ను వెనక్కు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబుతో జక్కన్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. అమరావతి డిజైన్ల కోసం రాజమౌళి ఎంతో కష్టపడ్డారు. రాజమౌళి అడిగితే చంద్రబాబు పవన్ ను ఒప్పించే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో పవన్ పట్టుదలతో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా డిస్ట్రిబ్యూటర్లు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని సమాచారం. సంక్రాంతికి రిలీజ్ కానున్న రాధేశ్యామ్ మూవీపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. 2022 సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.