ఎస్.ఎస్. రాజమౌళి.. దర్శకుడిగా తాను సినిమా సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ వెళ్లారు.. ‘బాహుబలి’ తో పాన్ ఇండియా, ‘బాహుబలి 2’ పాన్ వరల్డ్ పాపులర్ అయిపోయారు.. జక్కన్న మార్కెట్, రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయాయి.. దాని వెనుక 20 ఏళ్ల శ్రమ ఉంది.. సీరియల్‌తో స్టార్ట్ అయిన ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరుకోవడం వెనుక మాటల్లో చెప్పలేని డెడికేషన్ ఉంది.. సినిమా తీయడం కాదు దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం ముఖ్యం..
తన సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో జక్కన్నకు తెలిసినంతగా మరే ఫిలింమేకర్‌కి తెలియదనే చెప్పాలి.. ఎందుకంటే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఇండియా తరపున జ్యూరీ టీమ్ ఆస్కార్స్‌కి పంపలేదు.. దీంతో ప్రమోషన్స్‌ని పర్సనల్‌గా తీసుకుని, ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా.. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ.. విదేశాల్లో పలు చోట్ల ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ చేయిస్తూ..
స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కెమెరూన్ వంటి హాలీవుడ్ దర్శకుల ప్రశంసలు, పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు ఇండియన్ సినిమా ఆ మాట కొస్తే తెలుగు సినిమాకి ఆస్కార్ అనేది కలలో కూడా ఊహించలేం.. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు జక్కన్న.. ఇదిలా ఉంటే ఆయన యూఎస్ఏలో ఓ అద్దె ఇళ్లు తీసుకున్నారనే వార్త వైరల్ అవుతోంది.. RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం కుటుంబంతో కలిసి అన్నేసి రోజులు హోటల్‌లో ఉండాలంటే కష్టం కాబట్టి లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇంటిని రెంట్‌కి తీసుకున్నారట..
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సెలబ్రేషన్స్ కూడా ఆ ఇంట్లోనే గ్రాండ్‌గా జరుపుకున్నారని తెలుస్తోంది..జక్కన్న తర్వాతి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నారు.. యాక్షన్ అడ్వంచరస్ మూవీగా తెరకెక్కించబోయే దీని కోసం పలు హాలీవుడ్ స్టూడియోస్, టెక్నీషియన్లతో కలిసి వర్క్ చేయాలి.. దానికి సంబంధించిన పనుల కోసం కూడా ఈ హౌస్ ఉపయోగపడుతుంది.. దాదాపుగా అక్కడే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేయాల్సి ఉండడంతో రాజమౌళి అద్దె ఇల్లు తీసుకున్నారట..