Rajamouli, Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు కెరియర్ పరంగా ప్రభాస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ప్రభాస్ ఇప్పటికి సింగిల్ గానే ఉన్న విషయం మనకు తెలిసిందే.

ప్రభాస్ నాలుగు పదుల వయసులోకి అడుగు పెట్టినప్పటికీ ఇంకా పెళ్లి గురించి అసలు ప్రస్తావనకు కూడా తీసుకురావడం లేదు ఏదైనా ఇంటర్వ్యూలలో ఈయన పెళ్లి గురించి అడిగితే చాలా సరదాగా సమాధానాలు చెబుతూ ఈ ప్రశ్నలను దాటవేస్తూ ఉంటారు. ఇంకా గట్టిగా అడిగితే బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాతే నా పెళ్లి అంటూ సమాధానం చెబుతారు. ఇలా పెళ్లి గురించి ప్రభాస్ ఎక్కడా కూడా స్పందించకపోవడం గమనార్హం.

అయితే ఈయనకు నటి అనుష్క అలాగే కృతి సనన్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించినటువంటి ప్రభాస్ వారిద్దరు తనకు మంచి స్నేహితులు అని చెప్పి ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు. అయితే ఓ సందర్భంలో రాజమౌళి ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.. ప్రభాస్ రాజమౌళి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రభాస్ (Prabhas) గురించి పూర్తిగా తెలిసిన రాజమౌళి ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రభాస్ ఈ జన్మకు పెళ్లి చేసుకోలేడు అంటూ కామెంట్ చేశారు. ఎందుకంటే ప్రభాస్ కి చాలా బద్ధకం ఎక్కువ, చాలా సోమరితనంగా ఉంటారు. ఆయనకు కొత్త మనుషులతో మాట్లాడాలన్న, మనుషులలో కలిసిపోవాలన్నా అసలు ఇష్టం ఉండదు అంటూ సమాధానం చెప్పారు. అందుకే తాను పెళ్లి చేసుకోలేడు అంటూ రాజమౌళి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus