Rajamouli: అలాంటి సినిమా తీయడం సాధ్యం కాదంటున్న జక్కన్న!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచి రికార్డులు క్రియేట్ చేశాయనే సంగతి తెలిసిందే. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా జక్కన్నకు ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది. జక్కన్న సినిమాలో చిన్న పాత్రలో నటించినా చాలని ఎంతోమంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. తాజాగా రాజమౌళి ఒక సందర్భంలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జక్కన్న మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తాను ఇంకా తన కథనం, కథన శైలికి కట్టుబడి ఉన్నానని రాజమౌళి చెప్పుకొచ్చారు. నిరంతరం నన్ను నేను చక్కగా తీర్చిదిద్దుకోవాలని రాజమౌళి కామెంట్లు చేయడం గమనార్హం. అయిత తన స్టైల్ స్క్రీన్ ప్లేతో పాశ్చాత్య, ఆహ్లాదకరమైన కథను తెరకెక్కించడం సాధ్యం కాదని రాజమౌళి అన్నారు. ఒకవేళ నేను అలా చేశానంటే అది రెండు పడవలపైన ప్రయాణం చేయడం అవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందువల్ల నేను ఇతరులకు మార్గదర్శకుడిని కాదని రాజమౌళి కామెంట్లు చేశారు. రాజమౌళి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయలకు పైగా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి ఒక్కో ప్రాజెక్ట్ కు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్, లాభాల రూపంలో తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాసినిమాకు జక్కన్నకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus