Rajamouli, Nani: అలా చేయడం న్యాచురల్ స్టార్ కు సాధ్యమవుతుందా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి మూడేళ్లకు ఒక సినిమా తీస్తారనే విమర్శ ఉన్నా ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వివాదాలకు, వివాదాస్పద విషయాలకు జక్కన్న వీలైనంత దూరంగా ఉంటారు. ఇతర సినిమాలకు పాజిటివ్ గా పబ్లిసిటీ చేసే విషయంలో రాజమౌళి ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. నాని రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈగ మూవీ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. నాని నిర్మాతగా వ్యవహరించి అడివి శేష్ హీరోగా నటించిన హిట్2 మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

అయితే ఈ సినిమా ఈవెంట్ లో జక్కన్న మాట్లాడుతూ హిట్ సిరీస్ ను ప్రతి సంవత్సరంలో ఒకే సీజన్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేయాలని ఇలా చేయడం ద్వారా ఆ సీజన్ హిట్ మూవీ సీజన్ అని ప్రేక్షకులకు సైతం తెలుస్తుందని పేర్కొన్నారు. హిట్ ఫ్రాంఛైజీలో మొత్తం 7 సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం. హిట్2 మూవీలోనే హిట్3 మూవీలో నటించే హీరోకు సంబంధించి క్లారిటీ వస్తుందని ఇప్పటికే వెల్లడైంది.

రాజమౌళి సలహాను నాని పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది. జక్కన్న సైతం తన సినిమాల రిలీజ్ విషయంలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. మరి జక్కన్న మాటలను ఫాలో అయ్యి నాని వచ్చే ఏడాది ఇదే సమయంలో హిట్3 సినిమాను రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది. నాని ప్రస్తుతం దసరా సినిమాతో బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో నాని నటించిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus