Rajamouli: రాజమౌళి వల్ల బ్రహ్మాస్త్ర సినిమాకు ఏమైనా కలిసొచ్చిందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలకు తప్ప ఇతర సినిమా బాధ్యతలను తన భుజాలపై వేసుకోరు. అయితే బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమాకు మాత్రం ఈయన చాలా మద్దతు తెలిపారు. ఇక ఈ సినిమాని రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదల చేశారు.ఇక ఈ సినిమాని తెలుగులో ప్రమోట్ చేయడం కోసం రాజమౌళి ఎంతో కష్టపడ్డారని చెప్పాలి.

ఇక ఈ సినిమా తెలుగులో ప్రమోట్ చేయడం కోసం పలు ఇంటర్వ్యూలకు ప్రెస్ మీట్ లకు హాజరు కావడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఎన్నో అంచనాల నడుమ జక్కన్న ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ తెలుగులో విడుదల చేయగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేదని తెలుస్తోంది. కథ రొటీన్ గా ఉందని ఈ సినిమాపై పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేయడం కోసం రాజమౌళి నిర్మాతల నుంచి భారీగానే డబ్బు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక తెలుగులో ఈ సినిమా వ్యవహారాలను చూసుకోవడం కోసం ఈయనకు పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ చెల్లించాలని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఈ సినిమా బాధ్యతలను రాజమౌళి తీసుకోవడంతోనే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఇక రాజమౌళికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఈ సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదని,

ఇలాంటి సినిమాలు రాజమౌళి తన భుజాలపై వేసుకొని తన కెరియర్లో ఫ్లాప్ సినిమాను ఎదుర్కోవాల్సి వచ్చిందని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్ట లేకపోయినా ఈ సినిమా ద్వారా జక్కన్న మాత్రం బాగా లాభపడ్డారని మరికొందరు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన అనంతరం రాజమౌళి ఈ సినిమా ఫలితం పట్ల ఏ విధంగా స్పందిస్తారు.. ఈ సినిమా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారనే విషయం తెలుసుకోవాలని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus