సినీ ప్రేమికులలో కొద్దిరోజులుగా మదిలో మెదులుతున్న సందేహం ఒకటే. అదేమిటంటే ఈసారైనా ఆర్ ఆర్ ఆర్ అనుకున్న సమయానికి వస్తుందా అని. దానికి కారణం కరోనా బంద్ కొనసాగుతున్న తరుణంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోయింది. గత నెలలో మొదలుకావలసిన ఆర్ ఆర్ ఆర్ పూణే షెడ్యూల్ ఆగిపోయింది. నార్త్ ఇండియాలో ఓ లాంగ్ షెడ్యూల్ రాజమౌళి ప్లాన్ చేయగా, దానికి బ్రేక్ పడింది. ఈ షెడ్యూల్ నందు ఎన్టీఆర్, చరణ్ లతో పాటు, హీరోయిన్ అలియా భట్ కూడా పాల్గొనాల్సివుంది.
అల్లూరి సీతారామరాజు గా చేస్తున్న చరణ్ ప్రేయసి సీత రోల్ ఆమె చేస్తున్నారు. ఈ షెడ్యూల్ వాయిదాపడడంతో పాటు, ఎప్పుడు మొదలుపెడతారో తెలియని పరిస్థితి. కోరినా వైరస్ కేసులు దేశంలో భారీగా పెరుగుతూ పోతుండడంతో లాక్ డౌన్ ఇంకా పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య జక్కన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసి చెప్పినట్టుగా జనవరి 2021కి విడుదల చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది.
ఐతే ఈసారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా రావాలని నిశ్చయించుకున్న రాజమౌళి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇప్పటివరకు పూర్తయిన సన్నివేశాల గ్రాఫిక్ వర్క్ పూర్తి చేయిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పనిచేస్తున్న గ్రాఫిక్స్ నిపుణులు వి ఎఫ్ ఎక్స్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని నిర్మాత దానయ్య స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎక్కువ సమయం పట్టే గ్రాఫిక్ వర్క్ కరోనా లాక్ డౌన్ సమయంలో చేయిస్తున్నారు. కాబట్టి రాజమౌళి ఈ సారి చెప్పిన సమయానికి ఖచ్చితంగా వస్తాడని చెప్పొచ్చు.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్