సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. రజనీకాంత్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. రజనీకాంత్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించగా ఈ నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ 30 నిమిషాల పాటు కనిపించనున్నారని భోగట్టా. అయితే రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.
పెదరాయుడు మినహా రజనీకాంత్ గెస్ట్ రోల్ సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. వల్లి, కథానాయుడు, షారుఖ్ రా వన్ సినిమాలలో రజనీ గెస్ట్ రోల్స్ చేయగా ఈ సినిమాల ఫలితాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. విష్ణు విశాల్ హీరోగా లాల్ సలామ్ తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో విడుదల కావడం లేదు. తమిళనాడులో సైతం ఈ సినిమాకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
లాల్ సలామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. రజనీకాంత్ కు గతంతో పోల్చి చూస్తే మాత్రం ఆఫర్లు అయితే తగ్గుతున్నాయి. జైలర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో తర్వాత సినిమాలు కూడా ఆ సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
రజనీకాంత్ (Rajanikanth) తర్వాత ప్రాజెక్ట్ లతో వరుస విజయాలు సాధిస్తే ఆయనకు పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రజనీకాంత్ ఏడు పదుల వయస్సులో కూడా ఊహించని స్థాయిలో కష్టపడుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. రజనీకాంత్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.