సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పడయప్ప’ అదే ‘నరసింహ'(Narasimha) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ ఆడియన్స్ ఈ సినిమాని ఎగబడి చూశారు. రజినీకాంత్ స్టైల్,శ్వాగ్ వంటి వాటితో పాటు ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది రమ్య కృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర. రజినీకాంత్ కి ధీటుగా ఉంటుంది ఈ పాత్ర. దీని వెనుక చాలా కథ ఉంది అని చాలా మందికి తెలీదు.
నీలాంబరి పాత్ర కోసం దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రమ్యకృష్ణ కంటే ముందు చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించాడట.నిజానికి నీలాంబరి పాత్ర కోసం దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రమ్యకృష్ణ కంటే ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ను సంప్రదించారట. ఆ టైంలో ఐశ్వర్య రాయ్ రేంజ్ వేరు. పీక్స్ లో ఉంది. పారితోషికం పరంగా కూడా ఐశ్వర్య రాయ్ ఎవ్వరూ టచ్ చేయని రేంజ్లో ఉంది.

పైగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసేది. కానీ నీలాంబరి అనేది నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్. ఇంకో రకంగా ఆ సినిమాలో విలన్ రోల్ అని కూడా చెప్పొచ్చు. అందుకే అలాంటి పాత్ర చేస్తే.. తన ఇమేజ్ కు ఇబ్బంది ఎదురవుతుంది.. ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అనే ఉద్దేశంపై ఐశ్వర్య రాయ్.. ‘నరసింహ’ ఆఫర్ ను తిరస్కరించినట్టు స్పష్టమవుతుంది.
అటు తర్వాత కూడా రమ్య కృష్ణ పై దర్శకుడి ఫోకస్ లేదు. ఐశ్వర్య రాయ్ రిజెక్ట్ చేసిన తర్వాత నగ్మాని సంప్రదించాడట కె.ఎస్.రవి కుమార్. రజినీ సరసన ఆమె ఆల్రెడీ ‘భాషా’ సినిమాలో చేసింది. అందుకే ‘నరసింహ’ లో నెగిటివ్ రోల్ చేయడానికి ఆమె ఇష్టపడలేదట. ఆమె నో చెప్పిన తర్వాత మీనాని కూడా సంప్రదించాడు రవి కుమార్. ఆమె నీలాంబరి పాత్ర గురించి చెప్పగానే భయపడిపోయి నో చెప్పేసిందట. చివరాఖరికి రమ్యకృష్ణ ఫైనల్ అయ్యింది. అదీ మేటర్.
