Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

  • December 12, 2025 / 12:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

హీరో అంటే సినిమాల్లోనే కాదు, బయట కూడా హీరోలానే కనిపించాలి. బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, జనాల మధ్యలో ఉన్నప్పుడు.. స్టార్‌ హీరోలా ఉండక్కర్లేదు అని నిరూపించాడు. దానికి కారణం ఆయన హీరోగా మారడానికి ముందు ఓ సామాన్యుడు.. హీరోగా మారాక కూడా మేకప్‌ తీసేస్తే సామాన్యుడే. స్టార్‌ స్టేటస్‌ అందుకుని, ఎందరికో ఆరాధ్య దైవంగా మారిన తర్వాత కూడా ఆయన అలానే ఉన్నాడు. ఆ సామాన్య అసామాన్యుడే సూపర్‌ స్టార్‌ బిరుదాంకితుడు ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌.

Rajinikanth

అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజనీకాంత్‌ ఈ రోజు 75వ పడిలో అడుగుపెట్టాడు. ఇన్నేళ్ల జీవితంలో ఆయన చేసిన పనులు, చెప్పిన మాటలు, ఆచరించిన విషయాలు చూస్తే.. ఆయన సినిమాల్లో కంటే జీవితంలోనే పెద్ద సూపర్‌ స్టార్‌ అని అనిపించకమానదు. ఇలా ఎందుకన్నాం అనేది ఈ కథనం లోతుల్లోకి వెళ్లిన కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇక ఈ కథనం ముగిసేసరికి మీరు అదే మాట అంటారు. అప్పటికీ అనలేదు అంటే.. ఆయన మీద మీ ద్వేషం ప్రేమను మించిపోయింది అని అర్థం.

Dhanush Eyes on Rajinikanth Biopic After Ilaiyaraaja (1)

రజనీకాంత్‌ ఆఫ్ స్క్రీన్‌ గురించి చాలామందికి తెలుసు. సోషల్ మీడియాలో ఆయన ఆఫ్ స్క్రీన్‌ ఫొటోలు, వీడియోలు, సంగతులు చూసే ఉంటారు. వాటన్నింటినీ ఒక చోటకు చేర్చి.. వాటికి ఆయన లైఫ్‌ లెసెన్స్‌ కొన్ని యాడ్‌ చేస్తే.. వాటిని మనం ఆచరిస్తే అదిరిపోతుంది అని చెప్పొచ్చు. ఒక్క సినిమా హిట్‌ అయితేనే రెండో రోజుకు యాడ్స్‌ చేసేస్తున్న హీరోలున్న సినిమా పరిశ్రమల్లో ఇప్పటివరకు ఒక్కటీ ప్రైవేటు కమర్షియల్‌ యాడ్‌ చేయలేదు రజనీకాంత్‌.

మేలు చేసిన వాడిని మరచిపోవడం ఫ్యాషన్‌ అయిపోయిన ఈ సమాజంలో.. తన ప్రతిభను గుర్తించి, యాక్టింగ్‌వైపు వెళ్లు అని ప్రోత్సహించిన ఫ్రెండ్‌ రాజ్‌ బహదూర్‌ని ఇప్పటికీ రజనీ గుర్తుపెట్టుకున్నారు. గుర్తు పెట్టుకోవడమే కాదు.. తరచూ ఆయన ఇంటికి వెళ్లి కలసి కాసేపు సరదాగా మాట్లాడి వస్తుంటారు. తలైవాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. హిమాలయాలకు తరచూ వెళ్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన బండి ఆపి ఆహారం తీసుకోవడం చాలా సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Rajinikanth is the first choice for SVSC3

ఎక్కడో, ఏదో అన్నారని సహ నటుల గురించి మనసులో ఏదో పెట్టేసుకొని ఆ తర్వాత ఎదురుపడితే ప్లాస్టిక్‌ నవ్వులు నవ్వే నటులు ఉన్న సినిమా పరిశ్రమలో.. తనను ఓసారి విమర్శించి ఆ తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయిన నటి మనోరమను పిలిచి మరీ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్‌ ఇచ్చారు తలైవా. తోటి నటులు, తన కంటే జూనియర్ల ప్రతిభను గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటారు. వారి గురించి బహిరంగ వేదికల మీద మనసారా పొగిడేస్తారు. ఇలాంటి వాళ్లు ఇప్పుడెందరు ఉన్నారో మీకే తెలుసు.

75 ఏళ్ల జీవితం కదా.. ఎన్ని డక్కామొక్కీలు తినుంటారు చెప్పండి ఆయన. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా జీవితం గురించి ఎన్నో అంశాలు చెబుతుంటారు. ఓ సందర్భంలో రాజకీయాల్లో వెళ్దాం అనుకుని, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయారు. అయితే ఓ సందర్భంలో ఆయన పదవుల గురించి మాట్లాడుతూ ‘పదవులు కావాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ అది డబ్బులు సంపాదించడం కోసం కాకూడదు’ అని అన్నారు.

Star Actress Comments on Superstar Rajinikanth

రజనీకాంత్‌ తన ఎర్లీ డేస్‌లో మద్యపానం చేసేవారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ప్రముఖ నటుడు, తలైవా స్నేహితుడు మోహన్‌బాబు కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత తీసుకోవడం లేదు. దీని గురించి ఓ సారి మాట్లాడుతూ ‘మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని.. నాలుగు సీసాల మద్యం కొనుక్కుంటే మన ఆరోగ్యమే నాశనమవుతుంది’ అని చెప్పారు.

రజనీకాంత్‌ను దగ్గర నుండి చూసినవాళ్లు చెప్పేమాట ఏంటంటే.. ఆయనను కాస్త కదిపితే ఆయన పాటించే సిద్ధాంతాల గురించి ఆసక్తికరంగా చెబుతారు అని. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఆశావాదిని ఏ విషం కూడా ఏమీ చేయలేదు. కానీ నిరాశావాదిని ఏ ఔషధం కూడా కాపాడలేదు’ అని చెప్పారు. నిజానికి ఇప్పుడు చెప్పిన అంశాలు, విషయాలు, మాటలు చాలా తక్కువ. ఆయన పాటించే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి.

ఈ పుట్టిన రోజుకు ఈ మంచి మాటలు మాత్రమే. ఆయన ఇలాంటి మాటలు చెప్పే అవకాశం మరో 25 ఏళ్లు.. కుదిరితే ఇంకొన్ని సంవత్సరాలు ఆ దేవుడి ఇవ్వాలని కోరుకుందాం. ఇదంతా చెప్పాక అసలు మాట చెప్పకపోతే ఎలా.. హ్యాపీ బర్త్‌డే తలైవా!

‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Superstar Rajinikanth

Also Read

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Trivikram, Venkatesh: ఆ పేరేంటి.. ఆ రక్తమేంటి.. త్రివిక్రమ్‌ ప్లానింగేంటి?

Trivikram, Venkatesh: ఆ పేరేంటి.. ఆ రక్తమేంటి.. త్రివిక్రమ్‌ ప్లానింగేంటి?

Karthi: ‘ఖైదీ 2’.. ఆ అనుమానాలే నిజమవుతున్నాయా.. కార్తి మాటలు వింటే..!

Karthi: ‘ఖైదీ 2’.. ఆ అనుమానాలే నిజమవుతున్నాయా.. కార్తి మాటలు వింటే..!

related news

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Suniel Shetty: మమ్మల్ని విలన్లుగానే చుపిస్తాము అంటే.. మీ ఆఫర్లు మాకు అవసరం లేదు

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth, Balakrishna: రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Rajinikanth, Balakrishna: రజనీకాంత్‌, బాలకృష్ణకు అరుదైన గౌరవం… ఈ నెలాఖరుకే…!

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

trending news

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

1 hour ago
Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

Akhanda 2 Twitter Review: ‘అఖండ 2′ ట్విట్టర్ రివ్యూ’అఖండ 2’ ఆ 4 ఫైట్లు నెక్స్ట్ లెవెల్ అట.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయినట్లేనా?

14 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ అబ్సెన్స్ లో కూడా 2 వారాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

18 hours ago
Trivikram, Venkatesh: ఆ పేరేంటి.. ఆ రక్తమేంటి.. త్రివిక్రమ్‌ ప్లానింగేంటి?

Trivikram, Venkatesh: ఆ పేరేంటి.. ఆ రక్తమేంటి.. త్రివిక్రమ్‌ ప్లానింగేంటి?

20 hours ago

latest news

Darshan: జైల్లో హీరో.. థియేటర్లలో ‘నో రివ్యూ’.. డెవిల్ పరిస్థితి ఏంటి?

Darshan: జైల్లో హీరో.. థియేటర్లలో ‘నో రివ్యూ’.. డెవిల్ పరిస్థితి ఏంటి?

19 hours ago
Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

Prabhas: 4500 కోట్ల పందెం.. దడ పుట్టిస్తున్న డార్లింగ్ లైనప్!

19 hours ago
Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

Actress Pragathi : లైవ్ లో ఏడ్చేసిన నటి ప్రగతి… ఇంతకీ ఏమైంది..?

19 hours ago
Akhanda 2: బాలయ్య ముందు మిలియన్ డాలర్ల సవాల్.. అక్కడ గట్టెక్కేనా?

Akhanda 2: బాలయ్య ముందు మిలియన్ డాలర్ల సవాల్.. అక్కడ గట్టెక్కేనా?

19 hours ago
NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version