Rajeev Kanakala: తండ్రి విగ్రహాన్ని చూసి ఎమోషనల్ అయిన రాజీవ్!

ప్రముఖ బుల్లితెర, వెండితెర నటుడు రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట బుల్లితెర నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన రాజీవ్ కనకాల తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రాజీవ్ కనకాల ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా నటుడిగా మాత్రమే కాకుండా ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ భర్తగా కూడా రాజీవ్ కనకాల అందరికీ సుపరిచితమే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే రాజీవ్ కనకాల అప్పుడప్పుడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలలో కూడా సందడి చేస్తూ ఉంటాడు. ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన దిల్ సే షో లో కూడా రాజీవ్ పాల్గొన్నాడు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ టీవి షో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఈ షోకి సంబందించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఈ విధంగా రాజీవ్ ఇలా ఎమోషనల్ అవ్వటానికి అతని తండ్రి దేవదాస్ కనకాల కారణం. జీ తెలుగులో ప్రసారం అవుతున్న దిల్ సే షో లో పాల్గొన్న రాజీవ్ కనకాలని యాంకర్స్ సుధీర్, రష్మి తన తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరారు. ఈ క్రమంలో ఆయన తన తండ్రిని తలుచుకొని కొంచం ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగు వారు రాజీవ్ కనకాలకి ఒక కానుక అందించారు. ఈ కానుక తెరచి చూసిన రాజీవ్ ఒక్కసారిగ స్టేజి మీదే కన్నీళ్ళు పెట్టుకున్నాడు.

ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగు వారు రాజీవ్ కి తన తండ్రి దేవదాస్ కనకాల విగ్రహాన్ని బహుమతిగా అందించారు. తన తండ్రి విగ్రహాన్ని చూసి రాజీవ్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో రాజీవ్ జీ తెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇక దేవదాస్ కనకాల కూడా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడు, నటుడిగా నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus