స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలకు దర్శకత్వం వహించక ముందు శాంతినివాసం అనే సీరియల్ కు దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే. ఈ సీరియల్ కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. రాజీవ్ కనకాల తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శాంతి నివాసం సెట్ లో ఉన్న సమయంలో రాజమౌళి తన దగ్గరకు వచ్చి ఇక్కడ టీవీ ఇండస్ట్రీ ఏమీ తెలియదని
నా సహాయం కావాలని అన్నారని రాజీవ్ కనకాల వెల్లడించారు. సీరియల్ షూటింగ్ రోజున ఉదయం ఆరు గంటలకే ఫోన్ చేశారని కేవలం మూడు పేజీల డైలాగ్ లు ఉన్నాయని చెప్పడంతో గంటలో అయిపోతుందని వెళ్లానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. అయితే రాత్రి ఒంటి గంట వరకు షూటింగ్ ను సాగించారని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే రాజమౌళి జక్కన్నగా మారిపోయారని రాజీవ్ కనకాల కామెంట్లు చేశారు. ఆ తర్వాత స్టూడెంట్ నంబర్1 సినిమాకు పని చేసే అవకాశం దక్కిందని రాజీవ్ కనకాల వెల్లడించారు.
మొదట నేను పోషించిన పాత్రకు కొత్తవారు కావాలని అనుకున్నా రాజమౌళి చివరకు నన్నే ఫైనల్ చేశారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఆ సమయంలోనే జక్కన్నతో స్నేహం బలపడిందని రాజీవ్ కనకాల తెలిపారు. నా నటనను జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నటన విషయంలో నేను, తారక్ పోటీ పడి చేసినట్టు అనుకునే వాళ్లమని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
అమ్మ, నాన్న, చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు మరణించడం తలచుకుంటే బాధ తన్నుకొస్తోందని రాజీవ్ కనకాల వెల్లడించారు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో, బాలయ్య, సాయితేజ్, కీరవాణి అబ్బాయి సినిమాలలో నటిస్తున్నానని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?