మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో రజినీకాంత్ ఒకరనే సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కూడా రజినీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారు. కుర్ర హీరోల నుంచి పోటీ ఎదురవుతున్నా తన సినిమాలతో రజినీకాంత్ సత్తా చాటుతున్నారు. రజినీకాంత్ సినిమాలకు ఇప్పటికీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. రజినీకాంత్ నటించిన అన్నాత్తే(పెద్దన్న) తెలుగులో సక్సెస్ సాధించకపోయినా తమిళంలో మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
1950 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన రజినీకాంత్ జన్మించారు. బాల్యంలో నటనపై ఉండే ఇష్టంతో నాటకాలు వేసిన రజినీకాంత్ తర్వాత రోజుల్లో బస్ కండక్టర్ గా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత సినిమాలపై ఉండే ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన రజినీకాంత్ కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. అయితే ఆ పాత్రల ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల రజినీకాంత్ స్టార్ హీరోగా ఎదిగారు.
సీనియర్ ఎన్టీఆర్ కు సోదరుడిగా టైగర్ అనే మూవీలో రజినీకాంత్ నటించారు. తమిళంలో రజినీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. సినిమాల ద్వారా రజినీకాంత్ కోట్ల రూపాయలు సంపాదించగా రజినీకాంత్ ఆస్తుల విలువ 350 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. రజినీకాంత్ కార్ల విలువ 25 కోట్ల రూపాయలు అని సమాచారం.
అయితే అభిమానులు ఆదరించడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని భావిస్తున్న రజినీకాంత్ తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కొరకు ఖర్చు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేయడానికి రజినీకాంత్ ముందుకు వస్తున్నారు. అయితే తను చేసిన సహాయాల గురించి ప్రచారం చేసుకోవడానికి రజినీకాంత్ ఏ మాత్రం ఇష్టపడటం లేదు. మరోవైపు రజినీకాంత్ కొత్త సినిమాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెబితే మంచిదని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు. రజినీ ఆరోగ్యానికి సంబంధించి గతంలో పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!