Rajinikanth: పబ్లిక్ నోటీస్ జారీ చేసిన రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫొటో, వాయిస్ ని ఉపయోగించకూడదని నోటీసు జారీ చేశారు. ఒకవేళ అలా ఉపయోగిస్తే చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రజినీకాంత్ తరఫు న్యాయవాది సుబ్బయ్య యం.భారతి బహిరంగ ప్రకటన చేశారు. నటుడిగా రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయనకున్న ఫాలోయింగ్ ను కొందరు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపై అలా చేస్తే ఊరుకునేదే లేదని రజినీకాంత్ లాయర్లు చెబుతున్నారు.

వివిధ ప్లాట్ ఫామ్ లు, నిర్మాణ సంస్థలు రజినీకాంత్ పేరు, ఫొటోలు, వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం అక్రమంగా ప్రచారం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరైన అనుమతి లేకుండా ఇతరులు రజినీకాంత్ పేరుని వాడుకోవడం వలన ప్రజల్లో గందరగోళం ఏర్పడొచ్చు. తన పేరు, ఫొటోలు వంటివాటిని వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకునే హక్కు రజినీకాంత్ కి మాత్రమే ఉంది. వాటిని మరెవరూ ఉపయోగించకూడదు. ముందస్తు అనుమతి లేకుండా రజినీకాంత్ పేరు, ఫొటోలు, వాయిస్ ని వాడితే చర్యలు తప్పవని ప్రకటించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియాకి సంబంధించిన చాలా మంది నటీనటులు ఈ సినిమాలో భాగం కానున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.

తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఆ డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి!

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus