Rajinikanth: మరో సినిమా ఓకే చేసిన తలైవా..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ‘అన్నాత్తే’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇదే సినిమాను ‘పెద్దన్న’ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. భారీ వసూళ్లను మాత్రం సాధించగలిగింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు శివ రజినీకాంత్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సరైన స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు. ఇది కాకుండా రజినీకాంత్ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తమిళంలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు పాండిరాజ్. ప్రస్తుతం ఈయన సూర్య హీరోగా ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయనున్నారు. తాజాగా దర్శకుడు పాండిరాజ్.. రజినీకాంత్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో రజినీకాంత్ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ‘అన్నాత్తే’ సినిమా తరువాత రజినీకాంత్ సినిమాలకు దూరమవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus