Rajkumar Hirani, Ram Charan: చరణ్ తో సినిమాపై స్పందించిన రాజ్ కుమార్ హిరానీ.. ఏమన్నారంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు కాగా డంకీ సినిమాతో రాజ్ కుమార్ హిరానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ సినిమా నచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత కొన్నిరోజులుగా చరణ్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో సినిమా రానుందంటూ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తలు రాజ్ కుమార్ హిరానీ దృష్టికి రావడంతో ఆయన ఈ వార్తలపై స్పందించారు.

రామ్ చరణ్ తో నేను ఒక సినిమా చేస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆయన కామెంట్లు చేశారు. రామ్ చరణ్ ను ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా కలవలేదని రాజ్ కుమార్ హిరానీ పేర్కొన్నారు. రామ్ చరణ్ ను కలవకపోయినా అతని గురించి నేను విన్నానని రామ్ చరణ్ మంచి యాక్టర్ అని ఛాన్స్ వస్తే చరణ్ తో సినిమా చేయడానికి మాత్రం సిద్ధమేనని కామెంట్లు చేశారు.

రాజ్ కుమార్ హిరానీ కామెంట్లు మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించాయి. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉందని రాజ్ కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చేశారు. ఈ కాంబినేషన్ లో ఎప్పుడు సినిమా వచ్చినా బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేయాలంటే ఏడాదిన్నర సమయం పడుతుందని చెప్పవచ్చు.

రామ్ చరణ్ (Ram Charan) ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేస్తుండగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. రామ్ చరణ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus