‘RRR’ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ మీద సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఆ ఇద్దరు స్టార్స్ కలిసి కనిపిస్తే, ఆ ఎనర్జీ, ఆ వైబ్ వేరే లెవల్‌లో ఉంటుందని రాజమౌళి ప్రూవ్ చేశారు. ఆ సినిమా ఆస్కార్ వరకు వెళ్లింది. ‘RRR’ తర్వాత మళ్లీ ఈ ఇద్దరినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి ఫ్యాన్స్‌కు చాలా ఏళ్లు పడుతుందేమో అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
అలాంటి కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్ చేయాలంటే, రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దమ్మున్న డైరెక్టర్ ఎవరు? ఆ ఇద్దరు స్టార్ల ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ కథ రాయడం అంటే మాటలు కాదు. అందుకే, ఈ కాంబో ఇప్పట్లో రిపీట్ అవ్వదనే అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో, ముఖ్యంగా కోలీవుడ్ సర్కిల్స్‌లో ఒక క్రేజీ గాసిప్ ఫుల్ స్పీడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఆ గాసిప్ ఏంటంటే, ‘RRR’ తర్వాత ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్‌తో మరో మల్టీ స్టారర్ ప్లాన్ జరుగుతోందట. ఈసారి ఆ స్కెచ్ వేసింది మన తెలుగు డైరెక్టర్ కాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. ‘డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’ లాంటి బ్లాక్‌బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నెల్సన్ దిలీప్‌కుమార్.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పనిలో పడ్డాడని టాక్.

వినడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్న ఈ బజ్ ప్రకారం, నెల్సన్ ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ వేర్వేరుగా ఒక కథ నెరేట్ చేశాడట. ఆ స్టోరీ లైన్ ఇద్దరు హీరోలకూ బాగా నచ్చిందని, ప్రాజెక్ట్ గురించి పాజిటివ్‌గా ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇది నిజమైతే, ‘RRR’ తర్వాత ఇది మరో పాన్ ఇండియా సెన్సేషన్ అవ్వడం ఖాయం.

అయితే, ఈ గాసిప్‌లో లాజిక్ ఎంత ఉందనేది చూస్తే కాస్త డౌటే. ఎందుకంటే, నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘జైలర్ 2’ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమాను తమిళ్ న్యూ ఇయర్ ట్రీట్‌గా రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. అంతేకాదు, కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద మల్టీ స్టారర్.. అంటే రజినీకాంత్, కమల్ హాసన్‌లను కలిపి ఒక సినిమా తీసేది కూడా నెల్సనే అనే టాక్ నడుస్తోంది.

ఒకే డైరెక్టర్.. ఒకేసారి.. అటు రజినీ కమల్ అనే లెజెండరీ కాంబోను, ఇటు ఎన్టీఆర్ చరణ్ అనే ‘RRR’ కాంబోను హ్యాండిల్ చేస్తాడంటే నమ్మడం కొంచెం కష్టమే. ఎన్టీఆర్, చరణ్ కూడా వాళ్ల సొంత ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. కాబట్టి, ఈ వార్త ప్రస్తుతానికి ఒక క్రేజీ గాసిప్‌గానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. కానీ, ఒకవేళ ఈ పుకారులో కొంచెం నిజమున్నా.. ఫ్యాన్స్‌కు ఇంతకంటే పెద్ద కిక్ ఉండదు.
