 
                                                        బాహుబలి కంక్లూజన్ ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్ లో మరికొన్ని భారీ ప్రాజక్ట్ లు రూపుదిద్దుకోనున్నాయి. అందులో ఒకటి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్న రామాయణం ఒకటి. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజక్ట్ కి 500 కోట్లు వెచ్చించారు. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందునున్న ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులు నటించనున్నారు.వారి కోసం ప్రస్తుతం సెలక్షన్ జరుగుతోంది. అయితే ఇందులో ప్రధాన రోల్ అయిన రాముడిగా రామ్ చరణ్ తేజ్ అయితే బాగుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
కోరుకోవడమే కాదు ఏకంగా రాముడిగా చెర్రీ ఉన్న పోస్టర్ ని డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకంటోంది. సిక్స్ ప్యాక్ ఉన్న రాముడిగా రామ్ చరణ్ చాలా బాగున్నారు. నిర్మాతల సైడ్ నుంచి రామ్ చరణ్ ఓకే, మరి ఈ సినిమా డైరక్టర్ కి రామ్ చరణ్ ఓకేనా కాదో.. మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు కానీ ఈ మూవీపై ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
